పొత్తుల కోసం గులాబీ ఆరాటం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పొత్తుల కోసం గులాబీ ఆరాటం

హైద్రాబాద్, అక్టోబరు 2, (way2newstv.com)
మాకు మద్దతివ్వండి`...స‌హ‌జంగా కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు, లేదా చిన్నా చిత‌క పార్టీలు ఇలా ఇత‌ర పార్టీల‌ను క‌లిసి కోరుతుంటాయి. కానీ దీనికి భిన్నంగా తెలంగాణలో హాట్‌హాట్‌గా సాగుతున్న‌ హుజుర్‌నగర్ ఉపఎన్నికలో త‌మ‌కు మద్దతివ్వాలని సీపీఐని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. ముగ్థుం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కేకే, నామా నాగేశ్వరరావు, వినోద్ భేటీ అయ్యారు. ఖ‌చ్చితంగా గెలుస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న టీఆర్ఎస్ నేత‌లు...ఇలా... సీపీఐ పార్టీ కార్యాల‌యానికి వెళ్లి మ‌ద్ద‌తు కోరడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.హుజూర్‌న‌గ‌ర్‌లో పద్మావతి(కాంగ్రెస్‌), శానంపూడి సైదిరెడ్డి(టీఆర్ఎస్‌), పారేపల్లి శేఖర్‌రావు (సీపీఎం), చావ కిరణ్మయి (టీడీపీ), డాక్టర్‌ కోట రామారావు (బీజేపీ), డాక్టర్‌ రమణ (బీఎల్‌పీ), స్వతంత్ర అభ్యర్థి నవీన్‌కుమార్‌ తదితరులు ఇతరులు రంగంలో ఉన్నారు. 
పొత్తుల కోసం గులాబీ ఆరాటం

కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటు కావడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సీటు కావడంతో ఆ పార్టీకి ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. కాంగ్రెస్‌ను ఓడించాలని అధికార టీఆర్ఎస్‌ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ నేప‌థ్యంలో...దాదాపు 45 నిమిషాలపాటు ఇరుపార్టీల నేతల మధ్య మంతనాలు జరిగాయి. అనంతరం నాయకులు ఉమ్మడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఐ పోటీచేయడం లేదని తెలిసి.. వారిని తమ పార్టీకి మద్దతివ్వాలని కోరినట్టు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు తెలిపారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీపీఐ నాయకులను కలిసినట్టు చెప్పారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని అన్నారు.కాగా, హుజూర్‌నగర్‌ రాజకీయం రసవత్తరంగా మారింది.  కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దించింది. బలమైన స్థానిక నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతిపక్షాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను మచ్చిగా చేసుకుని ఓట్లు వేయించుకునేందుకు ప్రయ్నతం చేస్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్‌ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతవుతోంది. ఒకరిద్దరు నాయకులు మినహా ఇంకా పూర్తిస్థాయిలో నాయకులు రంగంలోకి దిగలేదు. కాంగ్రెస్‌కు ఆపన్నహస్తం అందిస్తుందనుకున్న టీడీపీ దూరమైంది. ఆ పార్టీ ఒంటరిగా పోటీకి దిగింది. సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చలేదు. ఈ నేప‌థ్యంలో...కారు పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకొని పొత్తుల కోసం చేయిచాస్తోంది.