ఎమ్మెల్యేను సత్కరించిన హోంగార్డులు
-పనికి తగిన వేతనంపై ఆనందం
ఎమ్మిగనూరు అక్టోబరు 24 (way2newstv.com)
పోలీసుల్లో ఒకరుగా ఉంటూ వారితో సమానంగా రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల శ్రమకు తగిన ఫలితం లభించిందని కర్నూలు జిల్లా వెల్ఫేర్ హోంగార్డు అసోసియేషన్ సహాయ కార్యదర్శి కర్ణాకర్ రెడ్డి,సీనియర్ హోంగార్డ్ మున్నా లు హర్షం వ్యక్తం చేశారు.వేతనం పెంచుతూ హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపి, వారి మనస్సును వైఎస్ జగన్ గెలిచుకున్నారు.
హోంగార్డులకు సిఎం వైఎస్ జగన్ వరాలు..
ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం హోంగార్డులు కలిసి చెన్నకేశవరెడ్డిని పూలమాలలతో సత్కరించి, తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ హోంగార్డులకు జీవితాంతం గుర్తుండేల భీమాతో పాటు వేతనం పెంచి పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈకార్యక్రమంలో హోంగార్డులు మల్లికార్జున, గౌడ్, వీరేశ్, వేణు, మల్లేష్, వలి, జగదీష్, రంగన్న, ఈరన్న, ఫయాజ్, లాలాజిరావు, రాఘవేంద్ర, నరసింహులు, కృష్ణ, భాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి, హనుమన్న, ఖాజ, గోవింద్, రామకృష్ణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.