దేశవ్యాప్తంగా పటేల్ జయంతి వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేశవ్యాప్తంగా పటేల్ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ  అక్టోబర్ 31, (way2newstv.com)
సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గురువారం ఐక్యతా దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద పటేల్కు నివాళులర్పించారు. అనంతరం ఏక్తా దివస్ పరేడ్లో పాల్గొన్నారు. అక్టోబర్ 31ని ఐక్యతా దినోత్సవంగా మోదీ 2014లో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మాట్లాడుతూ దేశ  సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నమని అన్నారు.  అనంతరం మోడీ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం దేశానికే గర్వకారణమన్నారు. 
 దేశవ్యాప్తంగా పటేల్ జయంతి వేడుకలు

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యత కోసం పాటుపడుతున్నారన్నారు. మనల్ని విడగొట్టేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులను ఎవరూ విడదీయలేరన్నారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కేంద్ర మంత్రులు అమిత్‌ షా, హర్‌దీప్‌ సింగ్‌ పురి, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజర్‌తో కలిసి దిల్లీలోని పటేల్‌ చౌక్‌ వద్ద సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అంతకు ముందు దేశ రాజధాని లో హోంమంత్రి అమిత్ షా ‘ఐక్యతా పరుగు’ను జెండా ఊపి ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ప్రారంభమైన ఈ పరుగు 1.5 కి.మీ సాగింది.  అంతకుముందు దీనిలో పాల్గొన్న వారితో షా ‘ఐక్యతా ప్రతిజ్ఞ’ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లు అమలులో ఉన్న అధికరణ 370, 35 ఏ ఉగ్రవాదానికి తలుపులు తెరిచాయన్నారు. వీటి రద్దుతో మోదీ ప్రభుత్వం ఉగ్రవాదానికి ద్వారాలు మూసేసిందన్నారు.