ప్రణాళికబద్దంగా భూ రికార్డుల ప్రక్షాళన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రణాళికబద్దంగా భూ రికార్డుల ప్రక్షాళన

ఏలూరు, అక్టోబర్ 31,(way2newstv.com):
జిల్లాలో రైతులభూముల విస్తీర్ణం ప్రభుత్వ రికార్డులతో పాటు క్షేత్రస్దాయిలో సక్రమంగా ఒకేలా ఉండేలా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రణాళిగా బద్దంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు  చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో గురువారం ఆర్ డిఓ.తాహసిల్దార్ , రెవెన్యూ అధికారులకు ఒకరోజు వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నంబూరు తేజ్ భరత్, నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాధన్  పాల్గొని భూములకు సంబంధించి రైతుల నుండి వస్తున్న అర్జీలు, పిటీషన్ల సమస్యలను ఏవిధంగా పరిష్కరించి  రికార్డులను సక్రమంగా ఉంచాలని అనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రేవు ముత్యాల  రాజు మాట్లాడుతూ భూరికార్డులపై అధికారులకు  స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. వెబ్ లాండ్ ఆర్ ఎస్ ఆర్ ఒరిజనల్ ఆర్ ఎస్ ఆర్ లో వున్న భూమి విస్తీర్ణం వ్యత్యాపాలను  సవరించాలన్నారు. 
ప్రణాళికబద్దంగా భూ రికార్డుల ప్రక్షాళన

వెబ్ లాండ్ ఆర్ ఎస్ ఆర్ కు ఒరిజినల్ ఆర్ ఎస్ ఆర్ కు మధ్య విస్తీర్ణంలో వ్యత్యాసం వున్న సందర్భంలో, భూమితో సంబంధం లేని వ్యక్తి పేరు, విస్తీర్ణం నమోదు వున్నప్పుడు, అమ్మకందారు,కొనుగోలు దారు ఇద్దరి పేర్లు నమోదై వుండి అమ్మకందారు పేరును తొలగించలసిన సందర్భంలో ఏమి చేయాలి అనే పలు అంశాలపై అవగాహన కలిగించారు. క్రయ విక్రయాలు, కుటుంబ సభ్యుల ఆస్తుల పంపకాల వంటి సందర్భలలో భూములు భాగాలుగా విడిపోయినప్పటికీ రికార్డులు, క్షేత్రస్థాయిలో భూమి విస్తీర్ణం లో మార్పులు ఉండకూడదన్నారు. గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారి సమస్యలు స్పష్టంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకునేలా చైతన్యం కల్గించాలన్నారు. రెవెన్యూ రికార్డులు పూర్తిస్థాయిలో ప్రక్షాళనా కార్యక్రమం ముగిసిన తరువాత ఏమైనా తప్పులు జరిగినా అవకతవకలకు పాల్పడినా, ఫైళ్లు కనబడకపోయినా, నిర్లక్ష్యంగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయడం వల్ల రైతులకు అన్యాయం జరిగినా సంబంధిత అధికారులపై  చర్యలు తీవ్రంగా ఉండాయని కలెక్టర్ హెచ్చరించారు. రెవెన్యూ రికార్డలను ప్రభుత్వ నిబంధనల వరకు సక్రమంగా  సవరించి  భూమి విషయంలో రైతులకు ఎప్పటికీ సమస్యలు  రాకుండా అధికారులు పకడ్బంధీగా చేయాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నంబూరు తేజ్ భరత్, నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాధన్, ఆర్ డిఓలు, తాహశిల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.