ఫెస్టివ్ ట్రీట్స్ పేరుతో ఆఫర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫెస్టివ్ ట్రీట్స్ పేరుతో ఆఫర్లు

హైద్రాబాద్, అక్టోబరు 18 (way2newstv.com)
దీపావళి, షాపింగ్ అనే పదాలకు సారూప్యత ఉంటుంది. దీపావళి వచ్చిందంటే చాలు ఆపర్ల మోత మోగిపోతుంది. దేశవ్యాప్తంగా షాపులు, స్టోర్ల ముందు డిస్కౌంట్ బోర్డులు, ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. కస్టమర్లు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఈ టైమ్‌లోనే మంచి డీల్స్ సొంతం చేసుకోవచ్చు.కస్టమర్ల దీపావళి సంబరాలను రెట్టింపు చేసేందుకు ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సిద్ధమైంది. ఈ పండుగ సీజన్‌లో అదిరిపోయే ఆఫర్లు మోసుకువచ్చింది. దీని కోసం ఫెస్టివ్ ట్రీట్స్ పేరుతో మెగా డిస్కౌంట్ ఆఫర్లకు తెరతీసింది. నెల రోజుల పాటు అందుబాటులో ఉండనున్న ఈ ఫెస్టివ్ ట్రీట్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 10,000కి పైగా స్టోర్లలో 1,000కి పైగా బ్రాండ్లపై డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటిపై బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఇన్‌స్టోర్, ఆన్‌లైన్ కొనుగోళ్లపై అదనపు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
ఫెస్టివ్ ట్రీట్స్ పేరుతో ఆఫర్లు

కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి..
దీపావళి వచ్చిందంటే చాలు.. స్మార్ట్‌ఫోన్స్ సహా ఇతర గ్యాడ్జె‌ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లు డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, వారంటీ ఎక్స్‌టెండ్ వంటి వాటితో కస్టమర్లను ఊరిస్తారు. అదే మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ అయితే స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ స్పీకర్లు వంటి పలు ప్రొడక్టులపై ఇంకా అదనపు డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చు.
1. ఐఫోన్ 11 ఫోన్‌ కొనుగోలుపై ఏకంగా రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే ఈఎంఐ, నాన్ ఈఎంఐ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.
2. షావోమి, వివో, ఒప్పొ స్మార్ట్‌ఫోన్లపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. శాంసంగ్ ఫోన్లపై 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
3. రిలయన్స్ డిజిటల్, జియో డిజిటల్ లైఫ్ స్టోర్లలో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.
4. అలాగే పైన పేర్కొన్న బ్రాండ్లలో కొన్ని ప్రొడక్టులపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా పొందొచ్చు.
5. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌పై రూ.3,000 వరకు తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన అన్ని రకాల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అలాగే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది.పండుగ సీజన్ వస్తే దాదాపు చాలా మంది కొత్త బట్టల కొనుగోలు చేస్తారు. మన కోసం మనమే బట్టలు కొనుగోలు చేస్తాం లేదంటే ఇతరులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కూడా దుస్తులు కొంటుంటాం. వీటి కొనుగోలుకు ఇదే సరైన సమయం. ఎందుకంటారా? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఫెస్టివ్ ట్రీట్స్‌లో భాగంగా పలు ఫ్యాషన్ బ్రాండ్లపై, రిటైల్ ఔట్‌లెట్స్‌లలో అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. రిలయన్స్ ట్రెండ్స్, ఏజియో అండ్ లైఫ్‌స్టైల్ వంటి రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మింత్రా, టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ వంటి వాటిల్లో ఆన్‌లైన్ కొనుగోళ్లు నిర్వహిస్తే 10 శాతం తగ్గింపు పొందొచ్చు.యారో, ఇన్‌గ్లోట్, వాన్ హ్యూసెన్, గాంట్, లా సెంజా వంటి రిటైల్ బ్రాండ్లలో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.కాల్ ఇట్ స్ప్రింగ్, న్యూ బ్యాలెన్స్, చార్లెస్ అండ్ కీత్ వంటి వాటిల్లో కొనుగోళ్లు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.రిలయన్స్ ఫుట్‌ప్రింట్‌కు వెళ్లి కొనుగోలు చేస్తే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.అంతేకాకుండా పిల్లల కోసం బట్టలు కొనుగోలు చేసినా కూడా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. బార్న్ బేబీస్ నుంచి కొనుగోలు చేస్తే 5 శాతం తక్షణ డిస్కౌంట్ వస్తుంది. చిల్డ్రన్స్ ప్లేస్‌కు కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అదే హామ్లీస్, మదర్‌కేర్ వంటి వాటిల్లో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.దీపావళి అంటే కొత్త స్మార్ట్‌ఫోన్, నచ్చిన బట్టలు మాత్రమే కాదండోయ్.. నచ్చిన ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి. ఇంట్లోనే వండుకొని తింటే ఓకే.. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు అయితే ఫుడ్ ఆర్డర్లపై కూడా తగ్గింపు ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డు ద్వారా జొమాటోలో రూ.300కు పైగా విలువైన ఆర్డర్ ఇస్తే రూ.75 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాల్లో ప్రీమియం రెస్టారెంట్లకు వెళ్లి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్ ఫుడ్ ట్రయల్ డైనింగ్ ప్రోగ్రామ్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల ద్వారా 40 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫెస్టివ్ ట్రీట్స్‌లో భాగంగా వివిధ రెస్టారెంట్లలో టేబుల్‌ను ముందుగానే రిజర్వు చేసుకోవడం వల్ల కూడా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
దీపావళి పండుగకు ఇంటికి అతిధులు కూడా వస్తుంటారు. వీటి కోసం స్పెషల్ వంటలు చేయాల్సి రావొచ్చు. దీని కోసం కిచెన్ ఐటమ్స్, ఇతర సరుకులు అవసరం అవుతాయి. వీటి కొనుగోలుపై కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది.
1. బిగ్ బజార్ నుంచి కొనుగోళ్లపై 5 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు.
2. డీమార్ట్ నుంచి కొనుగోలు చేసే ప్రొడక్టులపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
3. రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
4. బిగ్ బాస్కెట్ ద్వారా కొంటే 15 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ వస్తుంది. గ్రోఫర్స్ నుంచి కొనుగోలు చేస్తే రూ.250 వరకు తగ్గింపు పొందొచ్చు.
పండుగ వచ్చిందంటే ఏదో ఒక సినిమాలకు వెళ్లాల్సిందే. ఇందుకు దీపావళి కూడా మినహాయింపేమీ కాదు. ఈ పండుగ రోజు కూడా చాలా మంది కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. హెచ్‌డీఎఫ్‌సీ ఫెస్టివ్ ట్రీట్స్‌తో బుక్‌మై షో లేదా ఐనాక్స్ ద్వారా కనీసం రెండు సినిమా టికెట్లు బుక్ చేసుకుంటే రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది.ఇంకేందుకు ఆలస్యం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందిస్తోంది కదా.. ఆలస్యం చేయకుండా షాపింగ్ చేసేయండి. ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం హెచ్‌డీఎఫ్‌సీ మరిన్ని ఆఫర్లు పై క్లిక్ చేయండి. అదే పండుగ కోసం మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇంటిని ఇలా రెడీ చేసుకోండి పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి.