హైదరాబాద్ అక్టోబరు 18 (way2newstv.com)
ఆర్టీసీ సమ్మె విషయంలో మొండి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
కేసీఆర్ కు కార్మిక చట్టాల గురించి తెల్వదా?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లీకేజీలు ఇచ్చి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కార్మికులెవరూ భయపడవద్దని.. అందరికీ తాము అండగా ఉంటామని తెలిపారు.ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డితో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ పాల్గొన్నారు