ఇంగ్లీషే ముద్దు..తెలుగు వద్దే..వద్దు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంగ్లీషే ముద్దు..తెలుగు వద్దే..వద్దు

హైద్రాబాద్, అక్టోబర్ 30, (way2newstv.com)
రాష్ట్రంలో తెలుగు మీడియం చదువులకు ఆదరణ తగ్గుతోంది. ట్రెండ్కు తగ్గట్టు స్టూడెంట్లు ఇంగ్లీష్ మీడియం బాట పడుతున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లోనే ఎక్కువగా తెలుగు మీడియం కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఎయిడెడ్ కాలేజీలను మూసివేయడం, సర్కార్ కాలేజీల్లో డిమాండ్ లేదన్న కారణంతో పలు కోర్సులను బంద్ పెట్టడం వంటి కారణాల వల్లే స్టూడెంట్ల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. 2019–20 విద్యా సంవత్సరానికిగానూ ఐదు మీడియాల్లో అడ్మిషన్లు జరిగాయి. అందులో ఇంగ్లీష్‌ మీడియంలోనే ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. 1,90,325 మంది ఇంగ్లీష్ మీడియం కోర్సుల్లో జాయిన్ అయ్యారు. 2016–-17లో ఆ సంఖ్య 1,54,531. తెలుగు మీడియంలో కేవలం 30,763 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఆ సంఖ్య 59,210 నుంచి పడిపోయింది. 
ఇంగ్లీషే ముద్దు..తెలుగు వద్దే..వద్దు

పరిస్థితి ఇలాగే ఉంటే మరో ఐదేళ్లలో తెలుగు మీడియం కోర్సులు మూతపడినా ఆశ్చర్యం లేదని అధికారులు అంటున్నారు.ఇంగ్లీష్ మీడియంలో చేరుతున్న వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఏడాది మొత్తం 2,22,708 మంది డిగ్రీలో అడ్మిషన్లు తీసుకుంటే.. అమ్మాయిలు 1,21,620 మంది ఉన్నారు. 1,01,087 మంది అబ్బాయిలున్నారు. ఇంగ్లీష్ మీడియంలో 1,90,325 మందికిగానూ అమ్మాయిలే 1,05,865 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. అబ్బాయిలు 84,460 మంది ఉన్నారు. తెలుగు మీడియంలో 14,433 మంది అమ్మాయిలు, 16,330 మంది అబ్బాయిలున్నారు. నాలుగేండ్ల నుంచీ ఇంగ్లీష్ మీడియంలో అమ్మాయిలు, తెలుగు మీడియంలో అబ్బాయిలు ఎక్కువగా ఉంటున్నారు. అరబిక్లో 72, హిందీలో 55, ఉర్దూ మీడియంలో 1,495 మంది స్టూడెంట్లు చేరారు.గత ఏడాదితో పోలిస్తే డిగ్రీలో అడ్మిషన్లు తగ్గిపోయాయి. అయితే, బీఏకి మాత్రం డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో నాలుగేళ్లుగా దోస్త్ విధానంలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. మొత్తం 1,164 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 1,046 కాలేజీలు దోస్త్ పరిధిలో ఉన్నాయి. మిగతా 118 కాలేజీలు నాన్ దోస్త్ కేటగిరిలో ఉన్నాయి. వీటన్నింటిలో ఈ ఏడాదికి గానూ మొత్తం 4,55,265 సీట్లుండగా, కేవలం 2,22,708 సీట్లు భర్తీ అయ్యాయి. నాన్దోస్త్ కాలేజీల్లో అడ్మిషన్లు బాగా తగ్గాయి. దోస్త్ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 4,12,805 సీట్లుండగా, 1,99,806 సీట్లు మాత్రమే నిండాయి. నాన్ దోస్త్ పరిధిలోని కాలేజీల్లోని 42,460కు సీట్లకు 22,902 మంది చేరారు. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరిగినా, అడ్మిషన్లు మాత్రం 10,711 తగ్గాయి. అయితే, మూడేళ్లుగా బీఏకి డిమాండ్ పెరుగుతోంది. 2017–18లో 25,537 మంది బీఏలో చేరగా, గత ఏడాది 28,292 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 32,722కు పెరిగింది. అందులోనూ అమ్మాయిల సంఖ్యే పెరిగింది. 2017లో 11,826 మంది అమ్మాయిలు బీఏ చేరగా, 2019 నాటికి 14,148 మందికి పెరిగింది. గ్రూప్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు బీఏ కోర్సులు ఎక్కువగా ఉపయోగపడుతుండడం వల్లే యువత బీఏకే ఓటేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది బీఎస్సీలో 90,746 మంది, బీకాంలో 88,871 మంది చేరారు.