మొగుడ్ని ముద్దులతో ముంచెత్తిన శ్రియ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మొగుడ్ని ముద్దులతో ముంచెత్తిన శ్రియ

వైరల్ గా మారిన ఫోటోలు
చెన్నై, అక్టోబరు 29, (way2newstv.com)
తొలిసారి నటి శ్రియ తన భర్త ఆండ్రేని ముంబయిలో జరిగే వేడుకకు తీసుకొచ్చారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరానీ ముంబయిలోని తన నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు శ్రియ భర్తతో కలిసి వచ్చారు. అందమైన పేస్టెల్ లెహంగాలో ఆమె మెరిసిపోయారు. ఆండ్రే ఫార్మల్ ప్యాంట్, షర్ట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించారు. పార్టీకి వచ్చాక శ్రియ, ఆండ్రే కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం లిఫ్ట్‌లో ఎక్కడానికి వెళుతూ ఆండ్రేకు లిప్ లాక్ ఇచ్చారు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ అవకాశం మళ్లీ రాదన్నట్లు చకచకా ఫొటోలు క్లిక్‌మనిపించారు.రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రే, శ్రియ చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. 
మొగుడ్ని ముద్దులతో ముంచెత్తిన శ్రియ

2018లో ముంబయిలోని లోఖండ్‌వాలాలో శ్రియ, ఆండ్రే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నెల రోజుల ముందు శ్రియ ప్రేమలో ఉన్నారన్న విషయం బయటపడింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఆమె రిలేషన్‌షిప్ గురించి ఒక్క టాక్ కూడా రాలేదు. తన లవ్ లైఫ్ గురించి ఎక్కడా బయటపెట్టాలనుకోలేదు. అసలు శ్రియ పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందో లేదో అన్న సందేహం కూడా చాలా మందికి వచ్చింది. 2018లో ఆండ్రేను పెళ్లి చేసుకుని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రియ తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటోంది. ఆమె చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది కూడా తమిళ సినిమా.ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయింది. తెలుగులో మాత్రం తన నుంచి ఎలాంటి సినిమాలు లేవు. దాదాపు పదేళ్ల పాటు శ్రియ కెరీర్ దూసుకెళ్లింది. దక్షిణాదిలో ఈ తరం కథానాయికల్లో ఆమె చేసినన్ని సినిమాలు ఎవ్వరూ చేయలేదనే చెప్పాలి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు శ్రియ జోరు తగ్గింది. ఏదో ఒకటి అన్నట్లుగా వచ్చిన ప్రాజెక్ట్స్‌ను చేసుకుంటూ వెళ్లింది. అయినప్పటికీ శ్రియకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో శ్రియ నటించిన లాస్ట్ ఫిలిం ‘ఎన్టీఆర్: కథానాయకుడు’. ఇందులో శ్రియ.. ప్రముఖ నటి ప్రభ పాత్రలో నటించారు. హిందీలో ఆమె ‘తడ్కా’ సినిమాలో నటిస్తున్నారు.