హైదరాబాద్, అక్టోబర్ 02 (way2newstv.com)
తెలంగాణ శాసన సభ గాంధేయ వాద సిద్దాంతాలతో సాగుతుందని, ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు సైతం పూర్తిగా మహాత్మా గాంధీ అహింసాయుత విధానం తోనే సాధించుకోగాలిగమని రాష్ట్రశాసన సభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
తెలంగాణ శాసనసభలో గాంధీ జయంతి
రాష్ట శాసన సభా ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాసన మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్నేతి విద్యాసాగర్, రాష్ట్ర శాసన సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి బుధవారం పద్మారావు గౌడ్ నివాళులర్పించారు. సమకాలిన పరిస్థితుల్లో అన్నిసమస్యలకు గాంధేయ వాదం, విధానాలే పరిష్కారాలుగా నిలుస్తాయని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.