హైదరాబాద్ అక్టోబరు 24 (way2newstv.com)
ఇరవై రోజులుగా నడుస్తోన్న ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపడింది. దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇవ్వాళా…రేపా అంటూ ఎదురుచూసారు. లాభం లేకుండా పోయింది. దాంతో తమ నిరసన వ్యక్తం చేసారు. గురువారం ఉదయం మలక్ పేట నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ సమ్మె, దాని పై ప్రభుత్వ వైఖిరి కి నిరసనగా తిరగబడ్డారు.
సమ్మె ఇక్కట్లు….తిరుగబడ్డ జనాలు
బస్సులు రాకపోవడంతో మండిపడ్డారు. నడీ రోడ్ పై ట్రాఫిక్ నిలిపి రాస్తా రోకో నిర్వహించి నినాదాలు చేసారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మొండి వైఖిరికి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని వాపోయారు. దాంతో అక్కడ కొద్దిపాటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.