హైదరాబాద్ అక్టోబర్ 24 (way2newstv.com)
రేవంత్ రెడ్డి తరహాలోనే కోదండరామ్ నేడు పోలీసులకు చుక్కలు చూపించారు. ఛలో ప్రగతి భవన్ సందర్భంగా విస్త్రతమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులను తప్పించుకుని తన ఇంటి నుంచి బుల్లెట్ పై వచ్చి ప్రగతి భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధర్నా చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ధర్నాను నిలువరించలేకపోయినందుకు ఒక ఏసీపీ స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం కూడా తెలిసిందే.
రేవంత్ రెడ్డి తరహాలోనే పోలీసులకు చుక్కలుచూపించిన కోదండరామ్
అదే తరహాలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా నేడు పోలీసుల కళ్లు కప్పి వారికి బురిడీ కొట్టించారు. ఒకవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కామారెడ్డి పర్యటన పోలీసులకు చుక్కలు చూపించింది. ఆయన రాక కోసం భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు గంటల తరబడి వేచి చూస్తూ వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి పోలీసుల కళ్ళుగప్పి ఆర్టీసీ కార్మికుల టెంట్ వద్ద ప్రత్యక్షం అయ్యారు. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుసుకున్న కోదండరామ్ ఇతర దారి గుండా నేరుగా కార్మికుల టెంట్ వద్దకు చేరుకున్నారు. టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి వేచి ఉన్న తమను దాటుకుని కోదండరామ్ ఎలా వచ్చారో పోలీసులకు అర్ధం కాలేదు. రేవంత్ లాగా కోదండరాం పై పోలీసులు ఎన్ని కేసులు పెడుటారో !