దుర్గమ్మ సన్నిధీలో సీఎస్ ఎల్వీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దుర్గమ్మ సన్నిధీలో సీఎస్ ఎల్వీ

విజయవాడ అక్టోబరు 7, (way2newstv.com)
ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలుకన్నులపండువగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ రోజు మహిషాసుర మర్ధిని దేవిగా దుర్గమ్మ  దర్శనమిచ్చారు. మహిషాసుర మర్ధిని దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అయన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిషాసుర మర్ధిని దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది. 
దుర్గమ్మ సన్నిధీలో సీఎస్ ఎల్వీ

సృష్టికి మూలం తల్లి అటువంటి తల్లి అయిన మాతృ రూపాన్ని దగ్గరగా చేస్తే ఆనందంగా కలుగుతుంది. అమ్మవారి దయతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుందని అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తుల జీవితంలో మార్పు వస్తుంది.దేవస్థానం వారు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఏమైనా అసౌకర్యం కలిగిన భక్తులు దేవస్థాన సిబ్బందితో సహకరించాలని కోరుతున్నానని అన్నారు. స్థలం చిన్నది కావడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సాధారణమే. ఒకరుముందు,ఒకరు వెనుక వెళ్లే పరిస్థితులు ఉండవచ్చు. కానీ అందరికి అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అధర్మం పై ధర్మం జయించే విధంగా అసత్యం పై సత్యం జయించే విధంగా అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి. అమ్మవారి కరుణ కటాక్షలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎస్ వ్యాఖ్యానించారు.