రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వెలంపల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వెలంపల్లి

టూ విల్లర్ బైక్ పై పర్యటించిన మంత్రి
విజయవాడ అక్టోబరు 29 (way2newstv.com)
విజయవాడ నగరంలో లో రహదారి నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు . అందులో భాగంగా ఈరోజు 83 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. పశ్చిమ నియోజకవర్గం 26, 27, 28.. డివిజన్లలో 83 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నిర్మాణ పనుల నిమిత్తం  27 వ డివిజన్ మానవ మందిరం, కోటయ్య వారి వీధి నందు శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు.  
రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వెలంపల్లి

అనంతరం మంత్రి టూవీలర్ పై పర్యటించారు. 26 వ డివిజన్ లో  పార్థసారథి వీధి, తాయారమ్మ వీధి,, 27 వ డివిజన్ నందు కోట వారి వీధి, దుర్గా మల్లేశ్వర వారి వీధి, 28 వ డివిజన్ కాకర్ల వారి వీధి నందు  రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.తొలుత మంత్రి కి స్థానిక ప్రజలు బాణసంచాతో స్వాగతం పలికారు.27వ డివిజన్లో శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం మంత్రి స్థానికులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా హెచ్ పి  కాలనీ రోడ్ నిర్మాణం చేయాలని స్థానికుల కోరికను త్వరలో నెరవేరుస్తాం అన్నారు. అదే  విధంగా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో లారీ ఢీకొనడంతో విరిగిన కరెంటు స్తంభం వెంటనే బాగు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో  27,26,33 వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షు లు ఆంజనేయరెడ్డి, గుడివాడ నరేంద్ర, యెద్దు సురేష్, వైఎస్ఆర్సిపి నాయకులు కృష్ణా రెడ్డి, కేసరి సుబ్బా రెడ్డి,మైలవరపు దుర్గా రావు,జిఎంసి భాష, పదిలం రాజ శేఖర్,అన్వర్, ఖాదర్, బొమ్మా మదు, జోసఫ్,మాజీ కార్పొరేటర్ అప్పాజీ,  మరియు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..