చెన్నై కనెక్ట్ తో కొత్త అధ్యాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చెన్నై కనెక్ట్ తో కొత్త అధ్యాయం

చెన్నై, అక్టోబరు 12, (way2newstv.com)
భారత్‌-చైనా సత్సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. రెండో రోజు కోవలం బీచ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ ఇష్టాగోష్ఠి జరిపారు. అనంతరం ప్రతినిధుల బృందం స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌‌లు భేటీపై తమ అభిప్రాయాలను అధికారులతో పంచుకున్నారు. రెండు రోజుల పాటు ఐదున్నర గంటలు మోదీ, జిన్‌పింగ్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.‘చెన్నై కనెక్ట్‌’ భేటీతో భారత్‌-చైనా బంధంలో కొత్త అధ్యాయం మొదలైందన్న మోదీ... దీనికి వుహాన్‌లో జరిగిన తొలి భేటీనే స్ఫూర్తి.. చైనా, భారత్ మధ్య బలమైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలున్నాయి.. గత 2000 ఏళ్లుగా రెండు దేశాలూ ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైనవిగా ఉన్నాయి.. 
చెన్నై కనెక్ట్ తో కొత్త అధ్యాయం

తిరిగి పూర్వస్థితికి చేరుకుంటున్నాయి.. సున్నితమైన అంశాలతో ఇరు దేశాల మధ్య విభేదాలు పెరగకుండా సామరస్యంగా పరిష్కరించకుంటామని హామీ ఇస్తున్నాం. సంబంధాలు, సమస్యలపై సున్నితంగా ఉండి, ప్రపంచంలో శాంతి, స్థిరత్వం కోసం మనవంతు సహకారం అందజేద్దామని’ మోదీ చెప్పుకొచ్చారు.అనంతరం చైనా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఈ పర్యటన తాను ఎప్పటికీ మరిచిపోలేదని వ్యాఖ్యానించారు. మీ ఆతిథ్యం మమ్మల్ని ఎంతగానే మైమరచిపోయేలా చేసిందని, నాతోపాటు వెంట వచ్చినవారికి ఈ పర్యటన ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందన్నారు. మోదీజీ పేర్కొన్నట్లుగానే మా మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని జిన్‌పింగ్‌ కొనియాడారు. చర్చల అనంతం కోవలం రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్తువులు, హస్త కళా ప్రదర్శనను మోదీ, జిన్‌పింగ్‌ సందర్శించారు.మామల్లాపురంలో మోదీ, జిన్‌పింగ్ శుక్రవారం సమావేశమైన విషయం తెలిసిందే. శనివారం కోవలంలో తాజ్‌ ఫిషర్‌మ్యాన్స్‌ కోవ్‌ హోటల్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం బ్యాటరీ కారులో ప్రయాణించి సమావేశ గదికి చేరుకున్నారు. నిర్దిష్ట ఎజెండా, అధికార లాంఛనాలు లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో మోదీ, జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ముగిసిన పర్యటనరెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన పర్యటన ముగించుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు స్వయంగా వెళ్లి అతడిని సాగనంపారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీతో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. వారి ఆతిథ్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ పర్యటన అనంతరం జిన్ పింగ్ నేరుగా నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. తమిళనాడులోని కోలవమ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీ గురించి మోదీ మాట్లాడుతూ.. చెన్నై సమావేశం ఇరుదేశాల మైత్రిని మరింత బలపర్చిందని అన్నారు. వూహన్ సమ్మిట్ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ప్రధాని తెలిపారు. రెండు దేశాల మధ్య విశ్వాసం మరింత పెరిగిందని తెలిపిన మోదీ.. చెన్నై విజన్‌తో కొత్త శకం ఆరంభమైందన్నారు. చెన్నై, చైనా మధ్య ముందు నుంచే వాణిజ్య సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేశారు. భారత్-చైనాల మధ్య కొన్ని వేల సంవత్సరాల నుంచే ఆర్థిక శక్తులుగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.