జిల్లా అంతటా 144 సెక్షన్ విధింపు:కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లా అంతటా 144 సెక్షన్ విధింపు:కలెక్టర్

కర్నూలు, నవంబర్ 9 (way2newstv.com)
శనివారం నాడు అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించామని, పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా డిఎస్పీలు,సీఐ, ఏస్ఐలు, ఆర్డీఓలు, తహశీల్దార్లు, డిటీలు, గ్రామ స్థాయి విఆర్ఓ, విఆర్ఏ లు అందరూ శనివారం, ఆదివారం తప్పనిసరిగా వారు పని చేసే కేంద్రాల్లోనే హై అలెర్ట్ గా ఉంటూ పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో 144 సెక్షన్ విధించి ఎక్కడా శాంతి భద్రతలకు ఏ చిన్న విఘాతం కూడా కలగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు తనకు, జెసి, ఎస్పీ లకు విషయాలను తెలపాలని  కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జి.వీరపాండియన్ ఆదేశించారు.శనివారం ఉదయం ఎస్పీ డా.ఫక్కీరప్ప, జెసి రవి పట్టన్ షెట్టి లతో కలిసి జిల్లాలో ఉన్న అందరు జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డిఎస్పీలు, తహశీల్దార్లు, పోలీసు ఐన్స్పెక్టర్ లతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అత్యవసర టెలి కాన్ఫెరెన్సు నిర్వహించి హై అలర్ట్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా అంతటా 144 సెక్షన్ విధింపు:కలెక్టర్

శనివారం, ఆదివారం సెలవు అయినా ఆర్డీవో లు తహసీల్దారులు అందరూ వారి వారి హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని..పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రత లను పర్యవేక్షించాలని తహశీల్దార్ లను ఆర్డీఓ లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే శనివారంనాడు జిల్లా అంతటా 144 సెక్షన్ విధిస్తూ ఆయా మండలాల తహశీల్దార్ లు జారీ చేసిన ఆదేశాల ప్రొసీడింగ్స్ ప్రతులను వెంటనే డిఆర్ఓ కు పంపాలని, అన్ని వైన్ షాప్స్, బార్లు బంద్ చేస్తూ డ్రై డే ప్రకటించామని, మైక్, టామ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియచెప్పాలని, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా అందరూ గౌరవించాలని..తీర్పుకు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా నిరసనలు, చేయడం లేదా వేడుకలు చేసుకోవడం, బాణా సంచా పేల్చడం నిషేధం చేశామని, ఆదేశాలను గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.అలాగే ప్రజలు అందరూ అప్రమత్తంగా  ఉండాలని.. పుకార్లు..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని..తీర్పుపై సోషల్ మీడియా లో వివాదాస్పద, అభ్యంతరకర పోస్ట్ లను పెట్టవద్దని..ఫార్వార్డ్ లు చేయవద్దని అలా చేస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప లు స్పష్టం చేశారు.అదేవిధంగా, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఎవరైనా వదంతులు, పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రొటెస్ట్ లు, సెలెబ్రేషన్స్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని కూడా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప లు హెచ్చరించారు.జెసి2 సయ్యద్ ఖాజా మెహిద్దీన్, జేడీఏ విల్సన్ లు శ్వీయ పర్యవేక్షణ చేసి గ్రామ, మండల స్థాయి లో విఆర్ఓ, ఎంపీఈఓలు, తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారుల నేతృత్వంలో డా.వైఎస్ఆర్ రైతు భరోసా పై శనివారం నాడు ప్రత్యేక స్పందిను బాగా నిర్వహించాలని, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అనుకుంటే అక్కడ పరిస్థితిని బట్టి ఆర్డీవో లు, తహసీల్దార్లు నిర్ణయం తీసుకోవాలని, తప్పని సరి అయితేనే వాయిదా వేసుకోవాలని కలెక్టర్ వీరపాండియన్ స్పష్టం చేశారు.