ఏలూరు లోఅగ్రీగోల్ద్ బాధితులకు ఆర్థిక సహాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏలూరు లోఅగ్రీగోల్ద్ బాధితులకు ఆర్థిక సహాయం

ఏలూరు నవంబర్ 7,  (way2newstv.com)
రాష్ట్రంలో 3 లక్షల 70 వేల మందికి అగ్రిగోల్ద్ బాధితులకు 264 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా అగ్రిగోల్ద్ బాదితులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభతరుణం ఈరోజు రానేవచ్చిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. గురువారం ఏలూరు వట్లూరులోని శ్రీ కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన అగ్రీగోల్ద్ బాధితులకు ఆర్థిక సహాయం కార్యక్రమంలో పాల్గొన్న  నాని మాట్లాడుతూ అగ్రిగోల్ద్ బాధితులకు ఈరోజు చాలా శుభదినం అన్నారు. 10 వేల రూపాయలలోపు డిపాజిట్ చేసి నష్టపోయిన అగ్రిగోల్ద్ బాధితులకు సొమ్ములు చెల్లించే కార్యక్రమం ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్ది చేతుల మీదుగా ఒక పండుగ వాతావంణంలో జరుగుతోందని అన్నారు. 
ఏలూరు లోఅగ్రీగోల్ద్ బాధితులకు ఆర్థిక సహాయం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్ద్ స్థంస్థ 1995 లో స్థాపించబడి ప్రజల నుండి కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించి డిపాజిట్లుచేసిన ప్రజలను నిండాముంచి 2015 సం .లో ఆసంస్థను అర్దాంతరంగా మూసివేశారన్నారు. తినోతినకో ఎంతోమంది పేదవర్గాల ప్రజలు భవిష్యత్ అవసరాలకోసం సొమ్ములు ధాచుకున్నారని, దాచుకున్న సొమ్ము ఇకరాదని బెంగతో 364 మంది అగ్రిగోల్ద్ బాధితులు, ఏజెంట్లు మరణించారని అన్నారు. సం స్థ మూసేవేసే సమయానికి 10 వేలకోట్ల ఆస్థులతోవున్న ఆసంస్థ గత ప్రభుత్వ తప్పడు విధానాల వల్ల మూతపడిందన్నారు. గత ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు నష్టపోయిన అగ్రిగోల్ద్ బాధితుల కష్టాలు, కన్నీళ్లు పట్టించుకోకుండా కంపెనీని నాశనం చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి అగ్రిగోల్ద్ సంస్థకు చెందిన ఆస్తులపై కన్నువేసి వాటిని ఎలాగోలా స్వాధీనం చేసుకోవాలని గత పాలకులు చూశారని ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అని శ్రీ ఆళ్ల నాని దుయ్యపట్టారు. బాధితుల కష్టాలు గాలికివదిలేని వారి స్వార్దం చూసుకున్నారన్నారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్ది పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కాగానే అగ్రిగోల్ద్ బాధితులకు న్యాయం చేసేందుకు బడ్జెట్ లో 1150 కోట్లరూపాయలు కేటాయించారని అన్నారు. ఆ మేరకు 10 వేలు, అంతకు తక్కువ డిపాజిట్ చేసిన వారికి మొదటి విడతగా పశ్చిమగోదావరిజిల్లాలోని ఒక లక్షా 50 వేలమంది బాధితులకుగాను 32 వేల మందికి 23 నుండి 24 కోట్ల రూపాయలు ఈరోజు వారి అక్కౌంట్లలో జమచేయడం జరుగుతుందని చెప్పారు. ఇంకా ఎవరైనా వారిపేర్లు నమోదు చేసుకోకపోతే త్వరితగతిన నమోదు చేసుకోవాలని వారికి కూడా చెల్లించడం జరుగుతుందన్నారు. రెండవదశలో 10 వేల నుండి 20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి  ఆళ్ల నాని చెప్పారు. డైనమిక్ అయిన యువముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్ది సుపరిపాలనలో రాష్ట్రంలో ఏఒక్కరికీ అన్యాయం జరుగదని , అర్హతగల ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా  ఆళ్ల నాని చెప్పారు. చింతలపూడి శాసనసభ్యులు  ఎలీజా మాట్లాడుతూ ప్రయివేటు సంస్థలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవడం గతంలో ఎక్కడా లేదని, భారతదేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరగడం ఒక చరిత్ర అన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు మాట్లాడుతూ అగ్రిగోల్ద్ బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో 10 వేలు అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన వారికి సొమ్ములు చెల్లించాలని ప్రభుత్వం మొదట జిఓ విడుదలచేసినప్పటికీ ఇంకా మరికొందరికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో మళ్లీ వారంరోజుల్లోనే మరో జిఓ విడుదల చేసి రెండవ దశలో 10 వేల నుండి 20 వేలలోపు డిపాజిట్ చేసి వారికి సొమ్ము చెల్లించేలా నిర్ణయం తీసుకుందని చెప్పారు. భవిష్యత్ బాగుండాలని ప్రజలు వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటారని, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్ది, జాయింట్ కలెక్టర్ .2  నంబూరి తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.