విజయవాడ నవంబర్ 11 (way2newstv.com)
పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ విద్య, మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును కూడా దులిపేశారు. అదే చేత్తో చంద్రబాబును కూడా విమర్శించారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం చదువును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయకుడు తన కొడుకును ఏ మీడియంలో చదివించాడో చెప్పాలని వై ఎస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడి మనవడు ఎక్కడ చదవబోతున్నాడో కూడా చెప్పాలని ఆయన కోరారు.
ఉప రాష్ట్రపతితో సహ చంద్రబాబు, పవన్లను దులిపేసిన జగన్
అదే విధంగా వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా? అని సిఎం ప్రశ్నించారు. సినిమా నటుడు పవన్ కల్యాణ్ కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో, ఎంత మంది పిల్లలో మరి, ముగ్గురు భార్యలు అనుకుంటా. దాదాపుగా ఐదుగురు పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. మరి వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అంటూ సిఎం ప్రశ్నించారు. పేదల పిల్లలు విద్యలో రాణించాలనుకుంటున్నారు. అందుకోసం వారు ఇంగ్లిష్ మీడియమ్‌లో చదవాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి. అందుకే మన పిల్లలు ఇంగ్లిష్ మీడియమ్‌లో చదవాలని ఆరాటపడ్డాను. వారం క్రితం అందుకు సంబంధించి జీఓ జారీ చేస్తే, చాలా మంది పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబునాయుడు, ఎం.వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ ఇలా అందరూ విమర్శించారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రోజూ కధనాలు రాస్తున్నాయి. వారంతా తమ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి. అయ్యా చంద్రబాబుగారు మీ కొడుకు ఏ మీడియమ్‌లో చదివాడు? మీ మనవడు ఏ మీడియమ్‌లో చదవబోతున్నాడు? అయ్యా వెంకయ్యనాయుడు గారు మీ కొడుకు, మనవళ్లు ఏ మీడియమ్‌లో చదివారు? అయ్యా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారూ మీకు ముగ్గురు భార్యలు. మీకు నలుగురో అయిదుగురు పిల్లలు. మరి వాళ్లు ఏ మీడియమ్‌లో చదువుతున్నారు? అంటూ సిఎం చేసిన ప్రసంగం ఈ నాయకుల పరువు తీసేదిగా ఉంది. అయితే సభలో మాత్రం నవ్వులు విరిశాయి.