సింగిల్ గానే గంటా శ్రీనివాసరావు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సింగిల్ గానే గంటా శ్రీనివాసరావు

విశాఖపట్టణం, నవంబర్ 12, (way2newstv.com)
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సింగిల్ గా ఎపుడూ రారు, ఆయన వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే వారు కూడా ఫాలో ఫాలో అంటారు. అది ప్రజారాజ్యం నుంచి కంటిన్యూ అవుతోంది. అయితే గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ టీడీపీ ఇలా పార్టీలు మారి ఇపుడు టీడీపీలో ఉన్నా మనసు మాత్రం వేరే పార్టీలోకి లాగేస్తోంది. దాంతో ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోయారు నిన్నటివరకూ. ఇపుడు మాత్రం గంటా శ్రీనివాసరావు డిసైడ్ అయిపోయారట. బీజేపీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు రెడీ అంటున్నారు. ఢిల్లీ వెళ్ళి రెండు రోజుల పాటు కమలం పెద్దలతో మంతనాలు పూర్తిచేసుకొచ్చిన గంటా శ్రీనివాసరావు ఏ క్షణంలోనైనా కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 
సింగిల్ గానే గంటా శ్రీనివాసరావు

అయితే ఇపుడు గంటా శ్రీనివాసరావు ఒక్కడే వెళ్తారా లేక ఆయన అనుచరులు కూడా వెళ్తారా అన్న చర్చ విశాఖ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.గంటా శ్రీనివాసరావు వెంట ఉంటూ వచ్చిన బ్యాచ్ లో చాలా మంది ఇపుడు గంటా శ్రీనివాసరావు డెసిషన్ పట్ల కొంత అసంత్రుప్తిగా ఉన్నారని టాక్. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే తాము చేరి రాష్ట్రంలో అధికారం అనుభవించాలని వారంతా ఆరాటపడ్డారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం వైసీపీని కాదని బీజేపీలోకి వెళ్తున్నారు. దాంతో వారు ఇపుడు షాక్ తింటున్నారు. బీజేపీకి ఏపీలో ఏమీ లేదు, ఒకవేళ గంటా శ్రీనివాసరావు చేరినా అధికార దర్పం ఏదీ ఉండదు, రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల బీజేపీ అంటే అంత సుముఖంగా ఎవరూ లేరని వార్తలు వస్తున్నాయి. అలాగే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరి ఏం సాధించాలనుకుంటున్నారో కూడా వారికి అర్ధం కావడం లేదని అంటున్నరు.గంటా శ్రీనివాసరావుని ఇంతకాలం అనుసరిస్తూ వస్తున్న వారిలో మైనారిటీ నాయకులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖులు ఉన్నారు. వారు మాత్రం తాము బీజేపీలోకి రామని అంటున్నట్లుగా భోగట్టా. ఇది నిజంగా గంటా శ్రీనివాసరావుకు ఇరకాటమే. గంటా శ్రీనివాసరావు ఒక్కడుగా వెళ్తే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అదే ఆయన తనతో పాటు మందీ మార్బలాన్ని కూడా తీసుకువెళ్తే లెక్కలు గట్టిగా ఉంటాయి. అయితే బీజేపీ అనగానే మాత్రం క్యాడర్ కి నీరసం వస్తోందిట. మరి గంటా శ్రీనివాసరావు వీరికి ఎలా సర్దిచెప్పి తీసుకెళ్తారో.ఇక బడా నాయకులు కొందరిని తన వెంట పట్టుకువెళ్ళాని గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయనకు ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈసారి ఎందుకో గంటా శ్రీనివాసరావు మార్క్ పాలిటిక్స్ పెద్దగా పండడంలేదని అంటున్నారు. వైసీపీ వైపు చూపు ఉన్నా అక్కడ పరిస్థితుల బట్టి గంటా శ్రీనివాసరావు జై బీజేపీ అంటున్నారని భోగట్టా. మరి కమలం కండువాతో ఎలా మెరుస్తారో