ఈ నెలాఖరుకు తీరనున్న ఇసుక కొరత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ నెలాఖరుకు తీరనున్న ఇసుక కొరత

సమీక్ష భేటీలో సీఎం జగన్
అమరావతి నవంబర్ 04  (way2newstv.com)
 రాష్ట్రంలో ఇసుక కొరత తాత్కాలిక సమస్య అని, నవంబర్ నెలాఖరులోగా ఈ సమస్య తీరుందని భావిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక కొరతపై స్పందించారు. తాము పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. నిరంతర వరద వల్ల ఇసుక సమస్య వస్తోందన్నారు.
ఈ నెలాఖరుకు తీరనున్న ఇసుక కొరత

90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోంది. దీంతో 265 రీచ్ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా రీచ్లన్నీ వరదనీటిలో ఉన్నాయి. ఇసుక తీయడం కష్టంగా ఉంది. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచింది. ప్రొక్లెయినర్లు, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపారు. ఇప్పుడు మనం మాన్యువల్గా చేస్తున్నాం. కి.మీకు రూ. 4.90కి రవాణా చేసేవారిని రమ్మన్నాం. వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుంది. ప్రాధాన్యత రంగాలకు ఇసుక ఇవ్వడానికి ప్రత్యేక స్టాక్యార్డులు ఇస్తాం’’అని సీఎం జగన్ తెలిపారు.