పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్ రూరల్ నవంబర్ 28 (way2newstv.com):
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ మార్కెట్ కేంద్రంలో రూ.55 లక్షలతో నూతన షెడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, మార్కెట్ షెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం నీరుకుల్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతన్నలకు అండగా నిలిచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని కొనియాడారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుడదని, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని స్పష్టం చేసిన ఆయన మార్కెట్ కు వచ్చే ప్రతీ రైతు పండించిన పంటకు రక్షణ కల్పించాలన్నారు. రైతు ఏ కష్టం లేకుండా కంటి నిండా నిద్రపోయిన రోజే దేశం బాగుంటుందని చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఏఓ, మార్కెట్ షెడ్ ఎండి, మార్కెట్ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.