పంచాయితీలకు విద్యుత్ బిల్లుల పెండింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంచాయితీలకు విద్యుత్ బిల్లుల పెండింగ్

నిజామాబాద్, నవంబర్ 13, (way2newstv.com)
పాలకవర్గాలకు విద్యుత్‌ బిల్లుల రూపంలో షాక్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ విద్యుత్‌ బిల్లులను పంచాయతీలకు పంపింది. అందులోనూ మూడింతల అదనపు చార్జీల మోత మోగించింది. పాత బకాయిలను తాము వన్‌టైం సెటిల్‌ చేస్తామన్న ప్రభుత్వం.. దొడ్డిదారిన మూడు నాలుగింతల అదనపు చార్జీల రూపంలో వసూలు చేస్తోంది. బిల్లు కట్టని పక్షంలో విద్యుత్‌ కోత విధిస్తోంది. 14వ ఆర్థిక సంఘం నిధులు తప్ప పైసా ఇవ్వని సర్కారు.. ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గాల నెత్తిన 30 రోజుల ప్రణాళిక, ట్రాక్టర్ల కొనుగోలు వంటివి పెట్టింది. నిజామాబాద్‌ జిల్లాలోని 530 గ్రామపంచాయతీలకు కొన్నేండ్లుగా విద్యుత్తు బిల్లులు రూ.270 కోట్ల మేర పేరుకుపోయాయి. 30 రోజుల ప్రణాళికలో గ్రామాల్లో విద్యుత్తు తీగలు మరమ్మతు చేసి కొత్త మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం చెప్పింది. 
పంచాయితీలకు విద్యుత్ బిల్లుల పెండింగ్

పాత విద్యుత్‌ బకాయిలను తాము వన్‌టైం సెటిల్‌ చేస్తామని, ప్రతి పంచాయతికీ కొత్త విద్యుత్తు మీటర్లు అమర్చుతామని ప్రభుత్వం తెలిపింది. వీధిలైట్లు, బోరుబావుల మీటర్లకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తే చాలని చెప్పింది. కానీ, 14వ ఆర్థిక సంఘం మొదటి విడతగా విడుదల చేసిన నిధుల్లోంచి 30రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి పంచాయతీ తమ పరిధిలో పాత బిల్లుల్లోంచి 10శాతం చెల్లించాలని ఆదేశించింది. అలా చెల్లిస్తేనే 14వ ఆర్థిక సంఘం నిధులు సహా రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటునూ విడుదల చేస్తామని మెలిక పెట్టింది. తప్పనిసరి పరిస్థితిలో పంచాయతీలన్నీ 10 శాతం బిల్లులు చెల్లించాయి. కానీ, చాలా పంచాయతీలకు కొత్త మీటర్లు బిగించకుండానే సెప్టెంబర్‌, అక్టోబర్‌ విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం పంపింది. ఇలా నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రూ.10కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.విద్యుత్తు బిల్లుల్లో పాత బిల్లులనూ వసూలు చేసే ఎత్తుగడకు ప్రభుత్వం దిగింది. ప్రతి పంచాయతీ లోనూ వీధి దీపాలు, బోరుబావుల వినియో గానికి వాడుకున్న విద్యుత్‌ బిల్లులు మాత్రమే చెల్లించాలని.. ఇప్పుడేమో అదనపు చార్జీల పేరుతో మరింత వసూలు చేస్తోంది. పర్యవ సానంగా విద్యుత్‌చార్జీల కంటే అదనపు వడ్డింపే మూడు నుంచి నాలుగింతలు ఉండ టం గమనార్హం. నిజామాబాద్‌ జిల్లాలోని మో పాల్‌పంచాయతీలో అక్టోబర్‌కు సంబంధించి విద్యుత్తు చార్జి రూ.41వేల 421 రాగా, అదనపు చార్జి కింద రూ.48వేల 864 బిల్లు వేశారు. సెప్టెంబర్‌లో ఒక మీట ర్‌లో విద్యుత్తు చార్జి '0'(సున్నా) ఉన్నప్పటికీ.. అదనపు చార్జీ రూ.3513 విధించారు.14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాభివృద్ధికి వినియోగించాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు. ఈ సమయంలో విద్యుత్‌ బకాయిలను పంచాయతీలే కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సరికాదు. నిధుల్లేక అవస్థలు పడుతుంటే ప్రతి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం బాధాకరంపంచాయతీకి వచ్చే అరకొర నిధులు పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి వేతనాలకే సరిపోవడం లేదు. గ్రామాల్లో వీధిలైట్ల ఏర్పాటు, సీసీ, డ్రెయినేజీ నిర్మాణ పనులకు నిధులు మిగలడం లేదు. పంచాయతీలతో పాటు గ్రామాల్లో 5హెచ్‌పీ మోటార్లకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ బకాయిలనూ ప్రభుత్వమే చెల్లించాలి.సెప్టెంబర్‌, అక్టోబర్‌కు సంబంధించిన విద్యుత్‌ బిల్లులు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందువల్ల గ్రామపంచాయతీలకు నోటీసులు పంపుతున్నాం. ప్రభుత్వం పాత బిల్లులను వన్‌టైం సెటిల్‌ చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో.. ఆ బిల్లులతో సంబంధం లేకుండా కొత్త బిల్లులను పంచాయతీలు చెల్లించాల్సిందే.మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో నెహ్రూనగర్‌ మినహా 16 పంచాయతీల కార్యదర్శులకు, ప్రజాప్రతినిధులకు ట్రాన్స్‌కో ఏఈ సయ్యద్‌ ఇలియాజ్‌హైమద్‌ నోటీసులు జారీ చేశారు. రూ.17.50లక్షల విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని, నిర్ణీత గడువులో చెల్లించని కారణంగా దీపావళి రోజున విద్యుత్‌ సరఫరా బంద్‌ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంటకు పైగా గ్రామాలను అంధకారంలో ఉంచారు.