పవన్ కళ్యాణ్
విశాఖపట్నం నవంబర్ 5 (way2newstv.com)
151మంది ఎమ్మెల్యేలున్న పార్టీ... ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనపై ఆరోపణలు చేస్తున్నారంటే ఎవరు ఎవరికి భయపడుతున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా బలం ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
దెబ్బ తినడానికి రాలేదు.. తిన్నా తిరిగికొడతాం
మన మీటింగ్లకు వచ్చిన యువతలో 70శాతం ఓట్లేసినా... జనసేనకు 70 సీట్లు వచ్చేవన్నారు. వెన్నుపోటు పొడుస్తామంటే... పొడిపించుకుంటామా? అని ప్రశ్నించారు. దెబ్బ తినడానికి రాలేదని... ఒకవేళ దెబ్బ తిన్నా కూడా తిరిగికొడతామని పవన్ స్పష్టం చేశారు.