అమరావతి నవంబర్ 5, (way2newstv.com)
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
పేరు మార్పుపై సీఎం జగన్ సీరియస్
ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్ కలాం పేరునే పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్, జగ్జీవన్రామ్ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు.