విజయవాడ, నవంబర్ 8, (way2newstv.com)
ఇష్టం లేని చోట ఎన్నాళ్లు కూర్చుంటారు? కాళ్ల కిందకు నీళ్లొస్తున్నా.. ఎన్నాళ్లు ఓర్చుకుంటారు? ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ, ఎస్సీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎదుర్కొం టున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే ఉన్నా.. పార్టీలో నేతల వ్య వహార శైలితో డొక్కా మాణిక్య వరప్రసాద్ విసిగిపోతున్నారని, అందుకే పార్టీ మారాలని చూస్తున్నారనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యవహార శైలి ఉండడంతో అందరూ విస్మయం చెందుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల నాటి నుంచి ఆయన తీవ్ర మనస్థాపంతో ఉన్నారనేది వాస్తవం.
పార్టీ మార్పు దిశగా డొక్కా
డొక్కా మాణిక్య వరప్రసాద్ తనకు కలిసి వచ్చిన తాడికొండ నియోజకవర్గంలో టికెట్ కేటాయించాలని ఆయన చంద్రబాబును కోరారు. అయితే, బాబు ఈ టికెట్ కేటాయించాలని ప్రయత్నించినా.. పెద్ద ఎత్తున జరిగిన లాబీయింగ్ కారణంగా ఆయన చివరి నిముషంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ప్రత్తిపాడుకు కేటాయించారు. అయితే, ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నా. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్.. వర్గం.. ఎమ్మెల్యే ఓటు మీరు ఎవరికి వేసుకున్నా.. మాకేం ఫర్వాలేదు. కానీ, ఎంపీ ఓటు మాత్రం మాకే వేయాలని పిలుపు నివ్వడం, ప్రచారం చేయడంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ కు వ్యతిరేక పవనాలు వీచాయి.రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలులకు తోడు… ఇక్కడ గల్లా వర్గం సపోర్ట్ చేయకపోవడంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఓడిపోయారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి కూడా తీసుకు వెళ్లారు. పార్టీ అన్నాక అందరూ కలిసి ఉండాలని ప్రచారం ఎలా చేసుకున్నా.. ఏ రేంజ్‌లో చేసుకున్నా.. ఓట్లను విడదీసే రాజకీయాలు ఎలా చేస్తారని ఆయన గట్టిగానే ప్రశ్నించారు. అయితే, చంద్రబాబు నుంచి ఈ విషయంలో ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. దీంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర అసహనంతో ఉన్నారు. మరోపక్క, వైసీపీలో చేరిపోవాలని ఆయన చూస్తున్నారు. తనకున్న ఎమ్మెల్సీ పదవి వల్ల ఒరిగింది ఏమీ లేదని , అక్కడకు వెళ్లినా. తనకు ఏదో ఒక పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు.ఈ క్రమంలోనే తాడికొండలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉద్దేశ పూర్వకంగా చిచ్చు పెడుతున్నారు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన తెనాలి శ్రావణ్ .. తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన అసమర్ధుడు అనే రేంజ్‌లో డొక్కా మాణిక్య వరప్రసాద్ అనుచరులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రజలకు అందుబాటులో కూడా ఉండరని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై శ్రవణ్ సైతం ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యూహాత్మకంగానే ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఆయన కావాలనే వేటు వేయించుకుని… తప్పు పార్టీ మీద నెట్టేలా ఇదంతా చేస్తున్నారన్న సందేహాలు జిల్లా టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ? చూడాలి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగినా.. ఇలానే ఉంటుందనే అంటున్నారు విశ్లేషకులు