కర్నాటకలో ఉప ఎన్నికల కోలాహోలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నాటకలో ఉప ఎన్నికల కోలాహోలం

బెంగళూరు నవంబర్ 11, (way2newstv.com)
దేశంలో జరిగే ఎన్నికలు ఒకేత్తైతే, కర్ణాటక ఉప ఎన్నికలు మాత్రం రాజకీయ పక్షాలకు ప్రస్టేజీ ఇష్యూ అనే చెప్పాలి. అత్యDrకంగా కర్ణాటకలో 15 అసెంబ్లీ స్దానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూలు విడుదలవ్వడంతో ఇక   కన్నడ గడ్డపై రాజకీయ పోరుకు తెర లేచినట్లైంది. మరి ఈ పోరులో  బీజేపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అనే తలపడనున్నాయి.ఈ క్రమంలో డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల ప్రకటనతో ఎన్నకల కౌంట్ డైన్ మోదలైంది. 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న కారణంతో గత ప్రభుత్వంలో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 
కర్నాటకలో ఉప ఎన్నికల కోలాహోలం

దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితంలేకపోయింది. దీంతో  ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అయితే వీరి కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లోనే దీనిపై న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఉప ఎన్నికల ప్రకటనతో కన్నడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు జరిగే స్థానాల్లో గెలుపు అధికార బీజేపీకి సవాలుగా మారింది. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని యడియూరప్ప సర్కార్ భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇరు పార్టీల మధ్య ఏర్పడిన వైరుధ్యాలు బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఉప ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.కర్ణాటకలో ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాల్లో అథానీ, కాగ్వాడ్, గోకాక్, ఎల్లాపూర్, హీరేకేరూర్, రాణిబెన్నూర్, విజయనగర, చిక్కాబళ్లాపూర్, కేఆర్పుర, యశ్వంత్ పుర, మహాలక్ష్మీ, శివాజీనగర్, హోసకోటీ, కృష్ణరాజ్ పేట, హూన్సూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబరు 5వతేదీన ఉపఎన్నికలు జరుగనున్నాయి.అభ్యర్థులు నామినేషన్లను నవంబరు 11నుంచి 18వతేదీ వరకు సమర్పించాలని, నామినేషన్ల సెక్యూరిటీని నవంబరు 19న నిర్వహిస్తామని, నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 21 వతేదీని ఈసీ ప్రకటించింది.దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తను ముమ్మరం చేస్తే ... అనుసరించాల్సిన ఫ్యూహాలను అమలు చెయ్యడంతో అధిష్టానం పదును పెడుతోంది.మరి ఈ ఉప ఎన్నికల్లో ఎవరికి ప్రజలు పట్టం కడతారన్నది చూడాల్సిందే మరీ