టాలీవుడ్ స్టూడియోలపై ఐటీ దాడులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టాలీవుడ్ స్టూడియోలపై ఐటీ దాడులు

హైద్రాబాద్, నవంబర్ 20 (way2newstv.com)
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్‌ కార్యాలయాలతో పాటు వారికి చెందిన రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. స్టూడియోతో పాటు సురేష్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మూడు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. 
టాలీవుడ్ స్టూడియోలపై ఐటీ దాడులు

జూబ్లీ హిల్స్‌లోని సురేష్‌ బాబు నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.రామానాయుడు నిర్మాతగా ఉన్నంత కాలంగా వరుసగా సినిమాలు నిర్మించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఇటీవల పెద్దగా నిర్మాణం చేయటం లేదు. ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్‌ మీద దృష్టి పెట్టిన సురేష్‌ బాబు కంటెంట్‌ ఉన్న చిన్న సినిమాలను సమర్పిస్తూ సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా వెంకీ మామ సినిమాను తెరకెక్కిస్తున్నారు.