తగ్గని బంగారం ధర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తగ్గని బంగారం ధర

ముంబై, నవంబర్ 11 (way2newstv.com)
పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,600కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,300కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,650కు చేరింది.ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. 
తగ్గని బంగారం ధర

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.38,320కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.37,050కు దిగొచ్చింది.బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,650కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్కు 0.05 శాతం తగ్గుదలతో 1,461.05 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.33 శాతం పెరుగుదలతో 16.87 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.