ఏలూరు, నవంబర్ 21, (way2newstv.com)
వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజుపై రెండు మూడు రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే ఎంపీల్లో ముందుగా ఆయన పేరే వినిపిస్తోంది. ఇందులో వాస్తవ, అవాస్తవాలు ఎలా ? ఉన్నా పార్టీ గీసిన గీత ఆయన దాటుతున్నట్టు కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఎవ్వరూ కూడా జగన్ గీసిన గీత దాటే పరిస్థితి లేదు. ఎవరైనా సరే మాట్లాడాలంటే సవాలక్ష రూల్స్ ఉన్నాయన్నది పార్టీలోనే వినిపిస్తోన్న టాక్.. ? ఇదిలా ఉంటే ఏపీలో ఆంగ్ల భోధన ప్రవేశపెట్టడంతో విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.ఓ వైపు అటు టీడీపీ, ఇటు జనసేన దీనిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.
నర్సాపురం ఎంపీ జంపింగ్ జంపాంగా...
మరోవైపు దీనికి కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీకి చెందిన మంత్రులు, అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ టైంలో రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో రాజకీయ వర్గాల్లోనే తీవ్ర కలకలం రేపింది. అటు వైసీపీ వర్గాల్లోనే ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఆయన బీజేపీలోకి వెళతారన్న వార్తలు వచ్చిన మరోసటి రోజునే ఆయన జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయనపై సందేహాలు ముసురుకున్నాయి.ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కూడా హైలెట్ అవ్వడంతో సీరియస్‌గా తీసుకున్న జగన్ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వైవి.సుబ్బారెడ్డికి రఘురామకు వార్నింగ్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవ్వరూ గీత దాటినా తాను ఉపేక్షించనని కూడా జగన్ ఖరాఖండీగా చెప్పేశారట. సుబ్బారెడ్డి ఫోన్‌లో రఘురామకృష్ణంరాజుతో మాట్లాడి జగన్ సీరియస్ అయిన విషయం చెప్పడంతో ఆయన తాను తెలుగు భాషకు మద్దతుగా మాట్లాడానే తప్పా.. ఆంగ్లానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారట.ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజుపై పార్టీ మార్పు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి.. పార్టీలో అందరికి ఒక దారి అయితే ఆయన తనది మరో దారి అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న దానిపై కూడా పార్టీలోనే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పార్టీలో ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటున్నా దానికి ఎవ్వరూ అంగీకరించడం లేదు. పైగా పార్టీలోనే జగన్ ఎంత మాత్రం నమ్మని నేతల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఆయన గతంలో బీజేపీలో ఉన్నారు.. బీజేపీ జాతీయ నాయకులతో ఉన్న పరిచయాల నేపథ్యంలో తరచూ వాళ్లతో టచ్‌లోకి వెళుతున్నారు.ఈ విషయంపై కూడా ఆయనకు అధిష్టానం నుంచి వార్నింగ్‌లు వెళ్లాయట. ఇక కేంద్ర మంత్రులను తరచూ కలుస్తున్నారు. బీజేపీకి దగ్గరవుతున్నట్టు ఆయనకు ఆయనే సంకేతాలు ఇక ఆయనకు తమిళనాడు, ఉత్తరాఖండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పవర్ ప్లాంట్లతో పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా కొన్ని వివాదాల్లో పడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో తక్కువ ప్రయార్టీ ఇవ్వడం… ఢిల్లీలో కూడా స్వేచ్ఛ ఇవ్వకపోవడం.. అనుమతి లేనిదే ఎవ్వరిని కలవకూడదన్న రూల్స్ పెడుతుండడంతో ఆయన సహించలేకపోతున్నట్టుగా తెలుస్తోంది.అందుకే నియోజకవర్గంలోనూ ఆయన ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారు. నరసాపురం ఎంపీ పరిధిలో అదే వర్గానికి చెందిన మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, జగన్ సన్నిహితుడు అయిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకే ప్రయార్టీ ఇస్తూ రఘురామకృష్ణంరాజును లైట్ తీస్కొంటున్నట్టు స్థానికంగా చర్చ నడుస్తోంది. మరి రఘురామకృష్ణంరాజు సహనంతో ఉంటారా ? లేదా మరింతగా బరస్ట్ అవుతారా ? అన్నది చూడాలి. జగన్ మాత్రం వివరణ ఇచ్చినా రఘురామకృష్ణంరాజుపై తన ఆగ్రహాన్ని మాత్రం దాచుకోలేకపోతున్నారట