గొట్టిపాటి గోడ దూకడం కన్ ఫార్మేనా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గొట్టిపాటి గోడ దూకడం కన్ ఫార్మేనా...

ఒంగోలు, నవంబర్ 6, (way2newstv.com)
ఆయన ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నారు. అయినా ఆనందం లేదు. పార్టీ మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టి పాటి రవికుమార్ కు ఎప్పుడూ అదే పరిస్థితి ఏర్పడుతోంది. గత రెండు దఫాలుగా గొట్టిపాటి రవికుమార్ గెలిస్తే ఆయన పోటీ చేసిన పార్టీ అధికారంలోకి రావడం లేదు. దీంతో ఆయన పార్టీ మారాల్సి వస్తోంది. నియోజకవర్గం అభివృద్ధి కోసం గొట్టి పాటి రవికుమార్ పార్టీ మారుతున్నారంటే తప్పులో కాలేసినట్లే. ఆయన తన వ్యాపారాలను నిలుపుకునేందుకే పార్టీలు మారుతున్నారు. తాజాగా మళ్లీ ఆయనకు అదే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని తన అడ్డాగా చేసుకున్నారు. 
 గొట్టిపాటి గోడ దూకడం కన్ ఫార్మేనా...

అద్దంకి నుంచి హ్యాట్రిక్ విజయాలను సాధించారు గొట్టిపాటి రవికుమార్. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. రాజకీయ అరంగేట్రంలోనే అదరగొట్టేశారు. తొలిసారి గెలిచినప్పుడు తాను పోటీచేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో వైసీపీ పుట్టింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గొట్టి పాటి రవికుమార్ గెలుపొందారు.అయితే అప్పుడు వైసీపీ నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో గొట్టి పాటి రవికుమార్ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ రాజీనామా చేసి రావాలని కోరడంతోనే ఆలోచనలో పడ్డారు.గొట్టిపాటి రవికుమార్ పార్టీలు ఇలా మారడానికి కారణాలు లేకపోలేదు. జనంలో పట్టున్న రవికుమార్ కు వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అద్దంకి, చీమకుర్తి ప్రాంతాల్లో గ్రానైట్ వ్యాపారం ఉంది. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతిపక్షంలో ఉండటంతో గొట్టిపాటి రవికుమార్ పై అధికార పార్టీ వత్తిడి పెంచుతోంది. గ్రానైట్ కంపెనీలపై విజిలెన్స్ దాడులను నిర్వహిస్తుంది. టీడీపీలో అదే జరిగింది. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. దీంతో తన వ్యాపారాలను కాపాడుకునేందుకే గొట్టిపాటి రవికుమార్ తరచూ పార్టీలు మారుతున్నారన్నది వాస్తవం.