అట్టపెట్టలో వెంకన్న లడ్డూ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అట్టపెట్టలో వెంకన్న లడ్డూ

తిరుమల నవంబర్ 22 (way2newstv.com)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇకమీదట అట్టపెట్టె ప్యాకింగ్ లో లభించనుంది. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని టీటీడీ నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటి వరకూ కవర్ల ప్యాకింగ్ లో అందించిన లడ్డూ ప్రసాదాన్ని ఇకపై అట్టపెట్టెల ప్యాకింగ్ లో అందించనుంది.. దీనికోసం  యోగాలు కూడా చేపట్టింది. 10 రోజులపాటు అట్టపెట్టెలో ప్యాక్ చేసిన లడ్డూలను ల్యాబ్ లో పరిశీలించింది.  
అట్టపెట్టలో వెంకన్న లడ్డూ

ప్రసాదం  పాడవకుండా తాజాగా ఉండటంతో ఇక భక్తులకు అట్ట పెట్టెలలోనే ఇవ్వాలని నిర్ణయించింది.. లడ్డూతో పాటు అట్ట పెట్టెలకు కూడా చార్జీ వసూలు చేయనుంది.. అలాగే లడ్డూలను కాటన్ బ్యాగ్ లలో కూడా ఇవ్వనుంది.. ఈరోజు అట్ట పెట్టెల ఫ్యాకింగ్ ఛార్జీలను ప్రకటించింది.. ఒక లడ్డూ అట్ట పెట్టె రూ.3, రెండు లడ్డూలది రూ.5, నాలుగు లడ్డుల  కోసం  రూ. పది రూపాయిలు చెల్లించాల్సి ఉంది.. ఇక కాటన్ బ్యాగ్ ల ధరలు కూడా నిర్ణయించింది.. 5లడ్డూల బ్యాగ్ రూ.25, 10 లడ్డూల బ్యాగ్ రూ.30, 15 లడ్డూల బ్యాగ్ రూ.35, 25 లడ్డూల బ్యాగ్ రూ .55కి విక్రయించనున్నారు.