ఈ సూచనలు పాటిస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ సూచనలు పాటిస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం

సాధారణంగా మనకు వచ్చే తలనొప్పులు త్వరగానే తగ్గుతాయి కానీ మైగ్రేన్ తలనొప్పి అంత త్వరగా తగ్గదు. తీవ్రమైన నొప్పి, బాధ ఉంటాయి. నొప్పి పొడిచినట్లు వస్తుంటుంది. అయితే మైగ్రేన్ సమస్య వచ్చేందుకు అనేక కారణాలుంటాయి. ఈ క్రమంలో వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలాగే వైద్యులు సూచించిన మేరకు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. అయితే డాక్టర్లు సూచించే మందులతోపాటు కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే...
* నిత్యం మన శరీరానికి సరిపోయే నీటిని తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. డీ హైడ్రేషన్ బారిన పడి తలనొప్పిని తెచ్చుకుంటాం. అయితే నీటిని తగినంత మోతాదులో తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.
ఈ సూచనలు పాటిస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం

* రోజూ ఒకే సమయానికి నిద్రలేవాలి. కొందరు ఒక రోజు ఉదయాన్నే లేస్తే.. మరొక రోజు ఆలస్యంగా నిద్ర లేస్తారు. అలా చేయకూడదు. రోజూ ఒకే టైముకు నిద్ర లేవడం వల్ల ఒత్తిడి కలగకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది.
* కొందరు ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు. దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కచ్చితంగా చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ మానేయకూడదు. బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే ఒత్తిడి ఎక్కువై తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* కంప్యూటర్ల ఎదుట పనిచేసే వారికి సహజంగానే తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వారు మధ్య మధ్యలో కొద్దిగా బ్రేక్ తీసుకోవాలి. లేదా కంప్యూటర్‌కు కొంత దూరంలో ఉండి పనిచేయాలి. దీంతో కళ్లపై కలిగే ఒత్తిడి తగ్గి తలనొప్పి రాకుండా ఉంటుంది.
* నిత్యం అధిక మోతాదులో కాఫీ తాగినా లేదా మద్యం సేవించినా మైగ్రేన్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. కనుక వాటికి దూరంగా ఉంటే మంచిది.