భీమవరం టాకీస్ శివ 143 ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు వి.వి.వినాయక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భీమవరం టాకీస్ శివ 143 ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు వి.వి.వినాయక్

శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవ రం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం శివ 143..ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్  చేతుల మీదుగా జరిగింది.ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ...రామ సత్యనారాయణ.. నాకు చిరకాల మిత్రుడు..చిన్న సినిమాల నిర్మాణం లో అందెవేసిన చెయ్యి.. చిన్న సినిమా ఎలా తీయలో తీసిన సినిమాను ప్రేక్షకులలో కి ఎలా  తీసుకువెళ్లలో బాగా తెలిసిన వాడు...దర్శకుడు సాగర్ శైలేష్ హీరో గా దర్శకుడు గా.కొరియోగ్రాఫర్. గా బాగా చేసాడు ట్రైలర్ బాగుందీ..డీఎస్  రావు విలన్ పాత్రలో బాగా సూటు అయ్యాడు. 
భీమవరం టాకీస్ శివ 143 ట్రైలర్ ను విడుదల చేసిన  దర్శకుడు వి.వి.వినాయక్  

ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుక గా వస్తుంది అన్నారు.నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ...నేను ఏ పని చేసినా డైరెక్టర్ వినాయక్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన గతంలో మా రహస్యం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పడు శివ143 సినిమా ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదల అవ్వడం విశేషం. డైరెక్టర్, హీరో శైలేష్ ఈ సినిమాను అందంగా తెరకెక్కించారు.గతంలో మా భీమవరం టాకీస్ బ్యానర్ లో వచ్చిన రహస్యం తరహాలోనే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శైలేష్ హీరోగా, దర్శకుడుగా నేను నిర్మించిన రహస్యం సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ శైలేష్ నేను కలసి శివ143 సినిమాను తీశాము అన్నారు.