ఐదు నెల్లలోనే హామీల అమలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐదు నెల్లలోనే హామీల అమలు

కాకినాడ, నవంబర్ 21 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం కొమానపల్లిలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మత్స్యకారులకు రూ.10వేలు సాయం అందించనున్నారు. అలాగే సబ్సిడీ కింద డీజిల్ కూడా అందజేయనున్నారు. మత్స్యకార కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే రూ.10లక్షలు అందించనున్నారు. పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందుల్ని స్వయంగా చూశానన్నారు జగన్. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక మత్స్యకారులు వలస వెళుతున్నారని.. ఆ పరిస్థితుల్ని నివారించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకే మత్స్యకారులకు సాయం అందించేందుకు హామీ ఇచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం ఐదు నెలల్లోనే నెరవేరుస్తున్నాను అన్నారు. 
ఐదు నెల్లలోనే హామీల అమలు

ఇవాళే మత్స్యకారుల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ అవుతాయని.. 16,500 కుటుంబాలకు 74కోట్లు సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక డీజీలు కొనుగోలు సమయంలోనే రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని.. ప్రత్యేకంగా బంకుల్ని కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు సీఎం జగన్. ఈ ఉద్యోగులంతా గ్రామాల్లోనే ఉన్నారని.. ప్రజల ముందే.. వారి కోసం పనులు చేస్తున్నారన్నారు. ఇక రైతులకు అండగా నిలిచామని గర్వంగా చెబుతున్నామని.. 46లక్షలమంది అన్నదాతలకు రైతు భరోసా ఇచ్చామన్నారు. ఆటో, ట్యాక్సీ సోదరులకు సాయం చేశామని.. అగ్రిగోల్డ్ బాధితులకు నేను ఉన్నాను అని అండగా నిలిచామని చెప్పాదేవుడి దయతో, అందరి దీవెనలతో ఇదంతా చేయగలిగామన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు జగన్. అక్కా, చెల్లెమ్మలకు 50శాతం నామినేటెడ్ పదవులు ఇస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పనిచేస్తున్న తీరును ప్రజలు చూస్తున్నారని.. రాబోయే రోజుల్లో సుపరిపాలన అందిస్తామని గర్వంగా చెబుతున్నాను అన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు.నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తున్నామని.. ఇంగ్లీష్ మీడియం తీసుకురాబోతున్నామని సగర్వంగా చెబుతున్నాను అన్నారు ఏపీ సీఎం. పిల్లలు చక్కగా చదవి.. ప్రపంచంతో పోటీ పడాలని ఆకాంక్షించారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న నేతల్ని, కొన్ని మీడియా సంస్థల్ని ప్రజలే నిలదీయాలన్నారు. వాళ్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు సీఎం.