ఖరీఫ్ కోతలు షురూ... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖరీఫ్ కోతలు షురూ...

కాకినాడ, నవంబర్ 7, (way2newstv.com)
రాష్ట్రానికి ధాన్యాగారం గోదావరి జిల్లాల్లో 2019 ఖరీఫ్ వరి కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రకృతిపరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. సరిగ్గా గింజ కట్టే సమయంలోనే వరదలు ఎదురయ్యాయి. ఈ సీజన్‌లో గతంలో ఎపుడూ లేని విధంగా మూడుసార్లు భారీ వర్షాలు, వరదలు ఎదురయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా ముందస్తుగా సాగుచేపట్టిన భూముల్లో కోతలు మొదలయ్యాయి. సంప్రదాయబద్ధంగా సాధారణంగా దీపావళి పండగ అనంతరం కోతలు మొదలవుతాయి. ఈ ఏడాది ఎక్కువగా పంట కోత యంత్రాల ద్వారా కోతలు మొదలు కావడం విశేషత సంతరించుకుంది. ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనావేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల వరకు పంట నేలవాలింది. 
ఖరీఫ్ కోతలు షురూ...

సుమారు 45 వేల ఎకరాల్లో పంట పూర్తిగా నీటిలో నానింది. నీట మునిగిన ప్రాంతంలో దిగుబడి నాశిరకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనావేస్తోంది. ప్రస్తుతం గత జూన్ నెలాఖరుకు నాట్లు వేయడం పూర్తయిన ప్రాంతాల్లో ముందస్తు కోత దశకు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు డెల్టాల్లో ఆదివారం నుంచి కోతలు మొదలయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలవాలిన పంటను వరి కోత యంత్రాలంతో కోతలు మొదలు పెట్టారు. పంట నేలవాలిన చోట దిగుబడి బాగా తగ్గనుందని రైతులు చెబుతున్నారు. నేలవాలిన చోట్ల ఎకరాకు పాతిక బస్తాలే రావచ్చని అంచనావేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పు, పశ్చిమ, మధ్యమ డెల్టాల్లో 10.86 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగుచేశారు. 30 నుంచి 35 బస్తాల చొప్పున ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 28.50 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. గోదావరి జిల్లాల్లో ఈ ఖరీఫ్‌లో ప్రతీ ఏడాది మాదిరిగానే 60 శాతం స్వర్ణ రకం, 39 శాతం ఎంటీయూ 1056, 1053, 1001, 1010 రకాలతో పాటు ఒక శాతం బొండాలు రకాన్ని రబీలో విత్తనాల కోసం సాగుచేశారు. వరదలు, భారీ వర్షాల ప్రభావానికి గురైన ప్రాంతంలో కాకుండా మిగిలిన అన్ని చోట్లా దిగుబడి ఆశాజనకంగా వుందని వ్యవసాయ శాఖ అంచనావేసింది. ముందస్తు సాగు ప్రాంతాల్లో ఈ నెలాఖరులోగా కోతలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. గంటకు రూ.2500 చొప్పున చెల్లించి వరి కోత యంత్రాలను వినియోగిస్తున్నారు. పుష్కర, వెంకటనగరం, తొర్రిగడ్డ, చాగల్నాడు, ఏలేరు రిజర్వాయర్ నుంచి మెట్ట ఆయకట్టుకు ఆలస్యంగా సాగు నీరు విడుదల చేయడంతో ఆయా ప్రాంతాల్లోని ఆయకట్టులో ఈ నెలాఖరుకు కోతల దశకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మన్యంలోని భూపతిపాలెం, సూరంపాలెం, ముసురుమిల్లి సాగునీటి పధకాల నుంచి జూలై నెలాఖరు వరకు నీరు విడుదల కాకపోవడంతో రంపచోడవరం, గంగవరం మండలాల్లో ఖరీఫ్ పనులు ఆలస్యంగా సాగాయి. ఈ ప్రాంతాల్లో కూడా ఈ నెలాఖరుకు కోత దశకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలు పడ్డాయి