తండ్రి కాబోతున్న ప్రభాస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తండ్రి కాబోతున్న ప్రభాస్

హైద్రాబాద్, నవంబర్ 7  (way2newstv.com)
బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన సినిమా ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నేషనల్ స్టార్‌గా ప్రభాస్ స్థాయిని అయితే పెంచింది. ‘బాహుబలి’, ‘సాహో’ లాంటి రెండు భారీ బడ్జెట్ సినిమాల తరవాత ఇప్పుడు ప్రభాస్ ఒక లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. 
తండ్రి కాబోతున్న ప్రభాస్

ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందిఅయితే, ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని లేటెస్ట్ టాక్. చిత్ర యూనిట్ ద్వారా బయటికి వచ్చిన సమాచారం ప్రకారం తండ్రి, కొడుకుల పాత్రల్లో ప్రభాస్ కనిపించునున్నారని అంటున్నారు. అంటే, ఇప్పటి వరకు చేయని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారని సమాచారం. వాస్తవానికి తండ్రి పాత్రలో సత్యరాజ్ లేదంటే ఎవరైనా బాలీవుడ్ సీనియర్ నటుడిని తీసుకుందామని అనుకున్నారట. కానీ, ప్రభాస్ మాత్రం తండ్రి పాత్ర కూడా తానే చేస్తానని చెప్పారని ఇండస్ట్రీ టాక్. ‘బాహుబలి’లో ప్రభాస్ తండ్రి పాత్ర చేసినప్పటికీ.. తండ్రీకొడుకుల సన్నివేశాలు అయితే లేవు. కానీ, ఈ సినిమాలో ఉండబోతున్నాయని టాక్. ‘ఆంధ్రావాలా’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రీ కొడుకుల పాత్రలను స్వయంగా చేశారు. ఆయన మినహా ఇప్పటి వరకు ఏ ఇతర యంగ్ హీరోలు తండ్రీకొడుకుల్లా నటించలేదు. ఇప్పుడు ప్రభాస్ ట్రై చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఇది నిజమే అయితే వెండితెరపై తండ్రీకొడుకుల్లా ప్రభాస్ రెండు పాత్రల్లో ఎలా ఉంటారో చూడాలి. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.