అధికారులపై మండిపడ్డ హైకోర్టు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అధికారులపై మండిపడ్డ హైకోర్టు

తప్పుడు లెక్కలు ఇస్తున్నారంటూ ఆగ్రహం
హైదరాబాద్  నవంబర్ 7  (way2newstv.com)
ఆర్టీసీ సమ్మెపై గురువారం  హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బకాయి లేదని ఆర్థిక శాఖ తెలిపింది.  స్వయంగా తమ ముందుకు రావాలని అధికారులను హైకోర్టు  ఆదేశించడంతో విచారణకు సీఎస్ ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హాజరు అయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఇన్ చార్జ్ ఎండీ సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఘాటుగా స్పందించింది. ఆర్టీసీ ఎండీ చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయనీ, వాటిలో వేటిని పరిగణనలోనికి తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  
అధికారులపై మండిపడ్డ హైకోర్టు

రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదు, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని పేర్కొన్నహైకోర్టు ఇంతవరకు ఏ బడ్జెట్ లోనూ ఇలా చూడలేదని పేర్కొంది. తాను మూడు రాష్ట్రాల్లో పని చేశానని.. హైకోర్టుకు ఇలా ఎవరూ అబద్దాలు చెప్పలేదన్నారు. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలుఇవ్వడం ఆశ్చరంగా వుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరణనిస్తూ.. 2-6-2014 నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను మీకు అందించిన తాజా నివేదికలో పొందుపరిచామన్నారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో మీకు అందించామని హైకోర్టుకు తెలిపారు.మరోవైపు,  ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ ముగిసినా కార్మికులు ఇంకా సమ్మెలోనే కొనసాగుతున్నారు. ఈ నెల 9న మిలియన్ మార్చ్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ నిర్ణయాలకు ఎవ్వరూ భయపడవద్దని... ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉన్నందున.. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం కుదరదని జేఏసీ నేతలు చెబుతున్నారు.