వారం నుంచి పెట్రోల్ ధరల తగ్గుదల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వారం నుంచి పెట్రోల్ ధరల తగ్గుదల

విజయవాడ, డిసెంబర్ 17 (way2newstv.com)
దేశీ ఇంధన ధరలు చేరోదారిలో నడుస్తున్నాయి. ఈ రోజు కూడా ధరలు మిశ్రమంగా కదిలాయి. మంగళవారం పెట్రోల్ 6 పైసలు తగ్గితే, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.79.42కు తగ్గింది. డీజిల్ ధర మాత్రం రూ.72.07 వద్దనే కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.78.98కు దిగొచ్చింది. డీజిల్‌ ధర మాత్రం రూ.71.36 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. 
వారం నుంచి పెట్రోల్ ధరల తగ్గుదల

పెట్రోల్ ధర 7 పైసలు తగ్గుదలతో రూ.78.61కు క్షీణించింది. డీజిల్ ధర మాత్రం రూ.71.02 వద్ద నిలకడగా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.74.63కు దిగొచ్చింది. డీజిల్ ధర మాత్రం రూ.66.04 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.80.29కు క్షీణించింది. డీజిల్ ధర రూ.69.27 వద్ద నిలకడగానే కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.05 శాతం తగ్గుదలతో 65.31 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.08 శాతం తగ్గుదలతో 60.09 డాలర్లకు దిగొచ్చింది.ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు.