డబుల్ అయిన పోలీస్ టవర్స్ ఖర్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డబుల్ అయిన పోలీస్ టవర్స్ ఖర్చు

హైద్రాబాద్, డిసెంబర్ 3, (way2newstv.com)
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పోలీసు టవర్స్  పనులు మరింత జాప్యమవుతున్నయి. ముందు అనుకున్న దానికంటే ఖర్చు భారీగా పెరగడం, నిధుల కొరత, బిల్లుల విడుదలలో జాప్యమే దీనికి కారణమని సమాచారం. గతేడాది వరకు బిల్లులు రెగ్యులర్గా విడుదలయ్యాయని, తర్వాతి నుంచి పేరుకుపోయాయని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటికు సుమారు రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, పనులు పూర్తయినా పైసలురాక కాంట్రాక్టు సంస్థ వేగం తగ్గించిందని పేర్కొన్నారు. ‘‘ పోలీస్ టవర్స్ పనులు చేస్తున్న షాపూర్జీ పల్లోంజీ సంస్థకు ప్రభుత్వంలోని ముఖ్యులకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దాంతో కొన్ని నెలల పాటు బిల్లులు ఇవ్వకపోయినా పనులు చేశారు. 
డబుల్ అయిన పోలీస్ టవర్స్ ఖర్చు

కానీ వందల కోట్లు పెండింగ్లో పడటంతో పనులు స్లో అయ్యాయి. నిధులివ్వకపోతే కంపెనీ మాత్రం ఎట్లా పనులు పూర్తి చేస్తుంది?” అని సదరు అధికారి అన్నారు.పోలీస్ టవర్స్ నిర్మాణ పనులు 80 శాతం దాకా పూర్తయ్యాయి. ఇంటిరీయర్ పనులు చేయాలి.  కమాండ్  కంట్రోలింగ్లో సాంకేతిక పరికరాల ఏర్పాటుకు రూ.200 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఇప్పటికే రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల చేస్తేనే మిగతా పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో  ఆర్ అండ్ బీ అధికారులు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి, కొన్ని బిల్లులు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. వేగంగా పనులు పూర్తిచేయాలని కోరినట్టు తెలిసింది. “బిల్లులిస్తేనే పనిచేస్తమని కాంట్రాక్టు సంస్థ చెప్తోంది. అటు ఆర్థిక శాఖ నిధుల్లేవని అంటోంది. సీఎంవో నుంచేమో వేగంగా పనులు చేయాలని ఆదేశాలు వస్తయి. మధ్య లో మేం ఇబ్బంది పడ్తున్నం” అని ఆర్ అండ్ బీ అధికారులు చెప్తున్నారు.2015 నవంబర్లో టవర్ల నిర్మాణ పనులు మొదలైనయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతయని ఆశించారు. కానీ జాప్యం జరిగింది. డిసెంబర్ చివరినాటికి నిర్మాణం పూర్తిచేస్తారని భావించగా..ఇంకా ఇంటీరియర్ పనులు మొదలవలేదని తెలిసింది. ఈ పనులకు కనీసం రెండు మూడు నెలలు పడ్తుందని ఓ అధికారి చెప్పారు. సాంకేతిక పరికరాలు బిగించడానికి మరో నెలన్నర పడుతుందన్నారు. మొత్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి నాలుగైదు నెలల టైం పట్టొచ్చన్నారు. తొలుత నిర్మాణ వ్యయం రూ. 350 కోట్లుగా అంచనా వేశారు. కానీ పనులు పూర్తయేసరికే రూ.550 కోట్లకు చేరే అవకాశం ఉందని ఆర్ అండ్ బీ అధికారులు చెప్తున్నారు.