ఇక కరెంట్ చార్జీలు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక కరెంట్ చార్జీలు..

హైద్రాబాద్, డిసెంబర్ 3, (way2newstv.com)
ఆర్టీసీ బస్‌చార్జీలు పెరిగాయి, త్వరలో విద్యుత్ చార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్ చార్జీలను పెంచడానికి కసరత్తు పూర్తిచేసింది. ఏక్షణానైనా పెంచిన విద్యుత్ చార్జీలను అమలు చేయడానికి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముందు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడానికి సాహసం చేస్తుందా? అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను ఏమేరకు పెంచాలన్న అంశంలో ఈఆర్‌సీ అధికారులకు క్లారిటీ ఉందంటున్నారు. 
ఇక కరెంట్ చార్జీలు..

వాస్తవానికి శనివారం ఈఆర్‌సీ అధికారులు కొత్త విద్యుత్ చార్జీల పట్టికను విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈఆర్‌సీ చైర్మన్ హైదరాబాద్‌లో లేనందున పెరిగిన విద్యుత్ చార్జీల ప్రకటన వాయిదా పడిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ చార్జీలు పెంచకపోతే విద్యుత్ సంస్థల డిస్కంలు నష్టాల్లో కూరుకుపోతాయని ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ కార్మికులకు భారీగా వేతనాలను పెంచారు. పెరిగిన వేతనాలతోప్రభుత్వంపై భారీగా అదనపు భారం పడుతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మరోపక్క విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం వేలకోట్లు రూపాయలు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ అవసరం ఉంది.విద్యుత్తు చార్జీలను సవరించడం అనివార్యమని, లేకపోతే ఆదాయ లోటును ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో భర్తీ చేసుకోలేమని అధికారులు గుర్తుచేశారు.నాలుగేళ్లుగా చార్జీలు సవరించకపోవడంతో ఆదాయ లోటు పెరిగిందని, ప్రభుత్వ శాఖల బకాయిలు కూడా విడుదల కాలేదని, చార్జీల సవరణ అనివార్యమని ప్రతినిధులు గుర్తు చేశారు. సమావేశం అనంతరం ఏఆర్‌ఆర్‌కు తుది రూపు ఇచ్చారు. 30న ఏఆర్‌ఆర్‌ను, తర్వాత టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించాలని నిర్ణయించారు.తెలంగాణ డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయి. పలు విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.15,284 కోట్ల మేర బకాయి పడ్డాయి. డిస్కమ్‌ల కరెంటు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. విద్యుత్తును తీసుకున్న 60 రోజుల్లోగా ఉత్పత్తి సంస్థలకు డబ్బు చెల్లించాలి. తెలంగాణ డిస్కంలు మాత్రం కొన్ని విద్యుత్తు సంస్థలకు 859 రోజులైనా పైసా కట్టలేదు. ఇలా వివిధ సంస్థలకు రూ.9,704 కోట్ల మేర బాకీ ఉన్నట్లు ఇన్ఫర్మేషన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ (ఐసీఆర్‌ఏ) తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం బకాయిలు రూ.15,284 కోట్లుగా ఉన్నాయి.