రాజధానిని మార్చొద్దంటూ రోడ్డుపై బైటాయించిన దేవినేని ఉమ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజధానిని మార్చొద్దంటూ రోడ్డుపై బైటాయించిన దేవినేని ఉమ

సీబిఐ విచారణ చేస్తే అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏమిటో బట్టబయలౌతుంది
ప్రభుత్వం తమ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్
రాజధానిని పరిరక్షించాలంటూ నినాదాలు
విజయవాడ రూరల్ (గొల్లపూడి) డిసెంబర్ 19, (way2newstv.com)
ఏపీ రాజధాని గ్రామాల్లో ఆందోళన ఉద్ధృతమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజధాని కోసం తమ విలువైన భూములు పణంగాపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు తమను మోసం చేశారంటూ మండిపడుతున్నారు.  
రాజధానిని మార్చొద్దంటూ రోడ్డుపై బైటాయించిన దేవినేని ఉమ

గురువరం రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ‘మాపై ఎందుకు ఈ పగ.. అమరావతి రాజధానిగా ఉంచాలి’ అంటూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు.  ఈ ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను అరెస్ట్ చేసి, భవానీపురం స్టేషన్ కు తరలించారు.