ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నం: కేటీఆర్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నం: కేటీఆర్‌

హైదరాబాద్‌ డిసెంబర్ 17  (way2newstv.com)
ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నం జరుగుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖలపై మంత్రి కేటీఆర్‌ తెలిపారు.రాష్ర్టానికి సంబంధించిన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఇప్పటికే టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 11,569 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు, విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ ఉందన్నారు. సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించామన్నారు. మరింత ఉపాధి కల్పనే లక్ష్యంగా పలు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. 
ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నం: కేటీఆర్‌

టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు.టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులకు పలు అంతర్జాతీయ కంపెనీలు అంగీకారం తెలిపాయని మంత్రి వెల్లడించారు. పెట్టుబడుల సేకరణకు లక్ష్యాలు నిర్దేశించుకుని అధికారులు పని చేయాలి. వరంగల్‌ టెక్స్‌టైల్స్‌ పార్కులో దిగ్గజ కంపెనీ యంగ్‌ వన్‌ భారీ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు, బ్యాటరీ తయారీపై దృష్టి సారించాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. ల్యాండ్‌ బ్యాంక్‌, ఇండస్ట్రియల్‌ పార్కుల సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలి. కంపెనీలకు అవసరమైన మానవ వనరుల కోసం టాస్క్‌ లాంటి సంస్థలతో శిక్షణ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.