విజయవాడ, డిసెంబర్ 30, (way2newstv.com)
మరో ముప్పై సంవత్సరాలు అమరావతి అభివృద్ధి, ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ప్రచారం సాగించుకునే అవకాశం టిడిపి కి లేకుండా చేసింది వైసిపి ప్రభుత్వం. అందమైన అమరావతి తన కలగా పదేపదే చెప్పుకున్న చంద్రబాబుకి నిజంగానే ఆయన ఆలోచన ఒక స్వప్నమే అన్నది తేల్చేసారు జగన్. అందుకే క్యాబినెట్ భేటీ తరువాత మీడియా కు బ్రీఫ్ ఇచ్చే సమయంలో రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని నాని పదేపదే చంద్రబాబు కల, అంటూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇది ఆయన వెటకారంగా అన్నా కానీ ఆయన వ్యాఖ్యల్లో అంతరార్ధం మాత్రం టిడిపి అధినేతకు భారీ బహుమానంగా ఆయన ప్రాజెక్ట్ ఒక డ్రీమ్ మాత్రమే అని తేల్చేశారు.
కలగానే అమరావతి
లక్ష కోట్ల రూపాయల పైనే అమరావతిలో రాజధానికి ఖర్చు అవుతుందని ఇప్పటికే గతంలో చంద్రబాబు తెచ్చిన అప్పుకు వడ్డీలు చెల్లించలేక పోతుంటే కొత్తగా అప్పులు తెచ్చి అభివృద్ధి చేయాలిసిన పనేమిటి అన్నది నాని ద్వారా సర్కార్ సంధించిన ప్రశ్న.అదే విశాఖలో అయితే అమరావతిలో పెట్టే ఖర్చులో పదిశాతం ఖర్చు పెడితే అద్భుత రాజధాని అతి తొందరలో రాష్ట్ర వాసులు చూస్తారన్న వాదన క్రమంగా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం మొదలు పెట్టింది. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర అభివృద్ధి సర్వతోముఖంగా చేసేందుకే ఈ కార్యక్రమం గా సర్కార్ చెప్పుకొస్తుంది. విశాఖ లో వున్న లాభాలను అమరావతిలో వచ్చే నష్టాలను ఏకరువు పెట్టి కొత్త చర్చకు జగన్ నాని ద్వారా తెరతీశారు. రాజధాని ప్రాంతంలో ఒక కిలోమీటర్ రోడ్డుకి 42 కోట్ల రూపాయలా? అంటూ సామాన్యులకు తెలియని కోణాలు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇలా కిలోమీటర్ కి 42 కోట్ల రూపాయలను ఖర్చు చేసే స్థితిలో ఏపీ ప్రభుత్వం లేనేలేదని తేల్చి చెప్పారు. జగన్ సర్కార్ ప్రాధాన్యతలు విద్యార్థులకు పూర్తి ఫీజు రీ ఎంబర్స్ మెంట్, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలని అవన్నీ మానుకుని ఒకేచోట సొమ్మంతా ధారపోయలేమని అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేమని చెప్పడం ద్వారా మానసికంగా అమరావతి ఉద్యమ కారులకు వాస్తవాలు కళ్ళముందు పెట్టి చంద్రబాబు కలను తుడిచేందుకు గట్టి ప్రయత్నమే చేశారు నాని.జగన్ క్యాబినెట్ లో ప్రకటించడమే ఆలస్యం ఇదిగో భీమిలీలోనే ఎపి కార్యనిర్వాహక రాజధాని అంటూ రాజ్యసభ ఎంపి విజయసాయి పార్టీ లైన్, ప్రభుత్వ లైన్ కూడా దాటేసి ప్రకటనలు చేయడం పెనుదుమారామే రేపింది. జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అది అసెంబ్లీ వేదికగా చేయడం చర్చ జరగడం వల్ల పెద్దగా ఎవరు తప్పు పట్టలేదు. కానీ సాయి రెడ్డి కి జగన్ ఇచ్చిన చనువు ను ఆయన విధాన నిర్ణయాలు ప్రకటించే వరకు వెళ్లిందనే విమర్శల నేపథ్యంలో దీనిపై కూడా నాని చేతే కౌంటర్ ఇప్పించేశారు జగన్. విశాఖ జిల్లా ఇంచార్జ్ గా విజయసాయి ఆ ప్రాంతానికి ఆశించడంలో తప్పులేదని ఫైనల్ గా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని నాని చెప్పడం గమనిస్తే పార్టీలో వన్ టూ అనే చర్చకు తెరదించేశారు ముఖ్యమంత్రి.