డాక్టర్ ఎం.ఎస్.చౌదరి, తేజ రెడ్డి, `సురభి` ప్రభావతి, వేమూరి శశి, గోపరాజు విజయ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `ఆది గురువు అమ్మ`. ఇళయరాజా క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ ఎం.ఎస్.చౌదరి దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా....
వి.విజయేంద్ర ప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ - ``దైవ సమానులుగా భావించే తల్లిదండ్రుల ప్రేమను వెలకట్టలేం. తల్లి తన వారిపై చూపించే ప్రేమ చాలా గొప్పది. ఆమె తొలి గురువుగా బిడ్డకు అన్నీ తానై నేర్పిస్తుంది.
`ఆది గురువు అమ్మ` ట్రైలర్ విడుదల
అలాంటి అమ్మపై రూపొందిన `ఆది గురువు అమ్మ` ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బావుంది. అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని చూపించే చిత్రమిది. డాక్టర్ ఎం.ఎస్.చౌదరిగారు మంచి నటుడు. పలు చిత్రాల్లో నటించారు. ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.దర్శక నిర్మాత డాక్టర్ ఎం.ఎస్.చౌదరి మాట్లాడుతూ - ``అమ్మ గొప్పతనాన్ని తెలియజేసేలా చాలా సినిమాలు వచ్చాయి. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ప్రేమ గొప్పతనాన్ని తెలియజేసేలా రూపొందించిన సినిమా `ఆది గురువు అమ్మ`. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైలర్‌ను విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్‌గారికి థ్యాంక్స్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం`` అన్నారు.