పల్లె ప్రగతిలో రోజువారి కార్యక్రమాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పల్లె ప్రగతిలో రోజువారి కార్యక్రమాలు

వరంగల్ అర్బన్ డిసెంబర్ 31  (way2newstv.com)
 రెండో విడుత పల్లె ప్రగతి  కార్యక్రమం లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా  గ్రామాల్లో పలు అంశాలను తప్పనిగా నిర్వహించేందుకు  ప్రజలు గ్రామ  సర్పంచుల చే గ్రామ స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులు  మండల స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని   పచ్చదనం పరిశుభ్రత పాటించేందుకు  ప్రజలను చైతన్యం చేసి  గ్రామాల్లో సమూల మార్పులకు శ్రీకారం  చుట్టేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జె పాటిల్  తెలిపారు.  ప్రభుత్వం నిర్దేశించిన రోజు వారి కార్యక్రమం లో ఏలాంటి లోటు పాట్లు లేకుండా  నిర్వహించాలన్నారు రోజు వారి కార్యక్రమాల  వివరాలను  జిల్లా కలెక్టర్ వివరించారు.జనవరి 2 వ తేదీన : ఉదయం 9 గంటలకు  గ్రామసభ నిర్వహించిన పిదప  ఉదయం 11 .30 గంటల నుండి  గ్రామంలో పాద యాత్ర,రెండో దశ  పల్లె ప్రగతి  కార్య  చరణ  ప్రణాళిక  రూపొందించాలి జి పి లో  నర్సరీ,  డంపింగ్ యార్డు  వైకుంఠ దామాల  నిర్మాణ  ప్రదేశాల పరిశీలించి  లోటు పాట్లను  గుర్తించి  పనుల ప్రాంభించాలన్నారు 
పల్లె ప్రగతిలో రోజువారి కార్యక్రమాలు

ట్రాక్టర్లు, డోజర్ ,ట్యాంకర్  కొనుగోలు పక్రియాను పూర్తి చేసి   పై చర్యలు చేపట్టేందుకు వినియోగించు కోవాలి3 వ తేదీన  ఉదయం 8 గంటల నుండి  పారిశుధ్య దినోత్సవ  సందర్భంగా  అన్ని ప్రభుత్వ సంస్థల్లో  పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి, పిచ్చి మొక్కల  తొలగింపు, నీటి నిల్వ , రోడ్డు పై గల గుంతలను పుడ్చుట .శిథిల గృహాలను తొలగింపు, తడి పొడి చెత్త పై అవగాహన,  పాడుబడిన బావులను బోరులను పూడ్చుట చర్యలు చేపట్టాలని కలెక్టర్ వివరించారు. 4వ తేదీన  మూడవ రోజు చని పోయిన మొక్కల స్థానంలో మొక్కలు నాటుట  దినోత్సవం సందర్భంగా నాటిన మొక్కలను  సంవరక్షించుట  రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కల ప్రత్యేక దృష్టి  సారించాలి 100 శాతం సర్వేవల్ కాప్చర్ చేయాలి, మొక్కల చుట్టూ కలుపు మొక్కల చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి  మొక్కల చుట్టూ నీరు పోసెందుకు అనువుగా సాసర్ చేయాలి మొక్క చుట్టూ  ఏర్పాటు చేసిన ట్రీ గార్డు,కంచే లోపాలను  సరి చేయాలి5వ తేదీన  4 వ రోజు న ఉదయం 8 గంటల నుండి  పారిశుధ్య దినోత్సవం  నిర్వహించాలి ,అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి పిచ్చి మొక్కలను తొలగించుట నీటి నిల్వ ప్రాంతాల్లో రోడ్డుపై గుంతలను పూడ్చాలి శిథిల గృహాలను  తొలగించాలి తడి పొడి చెత్త  వేరు చేయుట పై అవగాహన కల్పించాలి  పాడు పడిన బావులు బోర్లు లను పుడ్చాలి  చేయాలి గ్రామంలో దోమల నివారణ పై పిచికారి చేయాలి జనవరి  6వ తేదీ 5 వ రోజునఇంకుడు గుంతల గ్రౌండింగ్ దినం  సందర్భంగా మంజూరైన ఇంకుడు గుంతలు అన్ని ఇంకుడు గుంతలు 100% గ్రౌండింగ్ చేయాలి మిగిలిన కుటుంబాలకు ఇంకుడు గుంతల మంజూరు చేయాలి ప్రగతిలో ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణాలను పూర్తి చేయాలిజనవరి 7 తేదీ ఆరవ రోజు ఉదయం ఎనిమిది గంటలకు శ్రమ దాన దినోత్సవం కార్యక్రమాలు చేపట్టుట పాఠశాలలు అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో  ఎస్సీ ఎస్టీ వా డల్లో, జన సమర్థ ప్రదేశాలలో గ్రామ ప్రజలు యువత విద్యార్థులు పింఛన్దారులు స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో  పరిసరాలను పరిశుభ్రంగా  చేయాలి ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం పై అవగాహన కల్పించాలి ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి గ్రామ పంచాయతీ వద్ద నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారుజనవరి  8వ తేదీ 7 వ రోజు ఉదయం 8 గంటల నుండి హరిత దినోత్సవం  సందర్భంగా చనిపోయిన మొక్కలు స్థానంలో తిరిగి మొక్కలు  నాటాలి ,గ్రామ నర్సరీల లో  100% బ్యాగ్ ఫిల్లింగ్ చేయాలి హరిత రక్షణ పట్టికను (అప్డేట్) నవీకరించాలిజనవరి 9 తేదీన 8 వ రోజున విద్యుత్ దినోత్సవం సందర్భంగా గా వినియోగ చార్జీలను చెల్లించాలి గత పల్లె ప్రగతిలో గుర్తించి మిగిలిపోయిన ఇతర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలిజనవరి 10 తేదీన 9 రోజున డంపింగ్ యార్డ్ వైకుంఠ గ్ దామాలు మ్యాప్ అప్ చర్యలు  చేపట్టే సందర్భంగా గా డంపింగ్ యార్డ్ వైకుంఠ దామాల నిర్మాణ సంబంధిత పనులను పూర్తి చేయాలిజనవరి 11 వ తేదిన 10 రోజున  ఉదయం 8 గంటల నుండి ఇంకుడు గుంతల గ్రౌండింగ్  దినోత్సవ సందర్భంగానూతనంగా మంజూరైన అన్ని ఇంకుడు గుంతలను 100% గ్రౌండింగ్   చేయవలెను వివిధ ప్రగతి దశలో ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణాలను పూర్తి చేయాలిజనవరి12 తేదీన 11 వ రోజు ముగింపు సందర్భంగా గ్రామసభ నిర్వహించి రెండో దశ పల్లె ప్రగతి లో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులను ఆదేశించారు నిర్దేశించిన రోజువారి కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేసేందుకు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు సమిష్టి కృషితో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని  కలెక్టర్ కోరారు. రెండో దశ పల్లె ప్రగతి లో ఆశించిన మెరుగైన ఫలితాలు కోసం చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేసిన వారందరికీ 26 వ జనవరి జరుగు గణతంత్ర  దినోత్సవ వేడుకల్లో ప్రశంసించడం తో పాటుగా   నగదు ప్రోత్సాహకలను  అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జె పాటిల్ పేర్కొన్నారు.