కైరో, జనవరి 25 (way2newstv.com)
సుమారు 3 వేల కిందట మమ్మీగా పూడ్చిపెట్టిన వ్యక్తి మళ్లీ మాట్లాడితే ఎలా ఉంటుంది? చాలా చిత్రంగా ఉంటుంది కదూ. అయితే, అతడిలో ప్రాణం ఉండదు కాబట్టి మనలా మాట్లాడలేడు. కానీ, అతడి స్వరాన్ని మాత్రం వినొచ్చు. అదెలా? అనుకుంటున్నారా? ఇదిగో ఇలాక్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో ఫారో రామెసెస్ XI పాలన కాలంలో నెశ్యామన్ అనే వ్యక్తి జీవించేవాడు. ప్రస్తుతం అతడి మమ్మీ ఇంగ్లాండులోని లీడ్స్ సిటీ మ్యూజియంలో ఉంది.
3000 ఏళ్ల ఈజిప్టు మమ్మీ మాట్లాడితే
నెశ్యామన్ మమ్మీని 1824లో తెరచి పరీక్షించారు. అతడు 50 ఏళ్ల వయస్సులో చనిపోయాడని తెలిసింది. అతడి నాలుక బయటకు వచ్చి ఉండటంతో తొలుత అతడిని ఎవరో గొంతు నులిచి చంపేశారని భావించారు. మరికొన్ని పరీక్షల తర్వాత.. నోటిలో ఇన్ఫెక్షన్ వల్ల అతడి నాలుక బయటకు వచ్చిందని తెలుసుకున్నారు.1941లో ఈ మమ్మీ ధ్వంసమయ్యేదే. అప్పట్లో లీడ్స్ మ్యూజియంపై అప్పట్లో బాంబుదాడి జరిగింది. దీంతో ఆ మ్యూజియం మొత్తం నాశనమైంది. అయితే, ఆ దాడికి ముందే నెశ్యామన్ మమ్మీని సురక్షిత ప్రాంతానికి తరలించారు.