అమరావతి కార్పొరేషన్ దిశగా అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమరావతి కార్పొరేషన్ దిశగా అడుగులు

విజయవాడ, జనవరి 25 (way2newstv.com)
అమరావతికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. అమరావతిలో ఉన్న 25 గ్రామపంచాయతీలతో పాటు, కొత్తగా మూడు పంచాయతీల (పెదపరిమి, వడ్డెమాను, హరిశ్చంద్రపురం)ను కలిపి అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏసీసీఎంసీ) ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుగుతున్నాయి.అధికారులు కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించే పనిలో ఉన్నారు. 
అమరావతి కార్పొరేషన్ దిశగా అడుగులు

పెదపరిమిలో గ్రామసభ నిర్వహించి.. అభిప్రాయసేకరణ జరిపారు. సభకు సంబంధించి స్థానికులకు సమాచారం లేక ఎక్కువమంది రాలేదట.. విలీనానికి గ్రామప్రజలు ఆమోదం చెబుతూ తీర్మానం ఆమోదించినట్లు అధికారులు చెప్పారట. అందరికీ సమాచారం ఇవ్వకుండానే గ్రామసభ ఎలా నిర్వహించారని అధికారులను కొందరు ప్రశ్నించగా.. ముందుగానే సమాచారం ఇచ్చామన్నారట.కొంతమంది ప్రశ్నించడం.. ప్రజలు తక్కువగా రావడంతో.. అధికారులు గ్రామసభను సోమవారానికి వాయిదా వేశారు. పేర్కొన్నారు. పెదపరిమితో పాటు, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాల్లోనూ సోమవారం గ్రామసభలు నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిసేందుకు మూడు గ్రామాల ప్రజలు అంగీకరించారని.. కానీ సీఆర్డీఏ రద్దును మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారని తెలుస్తోంది.ఈ నెల 9న రాజధానిలోని 25 గ్రామాలతో కార్పొరేషన్‌లో కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసి.. అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించారు. తర్వాత మరో మూడు గ్రామాలను కార్పొరేషన్ పరిధిలో కలపాలని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి లేఖ రాశారు. ఆ తర్వాత కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ వెళ్లింది. తర్వాత ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఆ మూడు గ్రామాల్నీ ఏసీసీఎంసీలో విలీనం చేశారు.ఈ కార్పొరేషన్ ఏర్పాటుపై ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కూడా చర్చించారు. కాకపోతే రాజధాని అంశంపై క్లారిటీ రాకుండా.. సీఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించుకోక ముందే ప్రజాభిప్రాయసేకరణ చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటు అమరావతి ప్రాంత రైతులు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. తాము గ్రామసభలో అభిప్రాయాలను తెలియజేస్తామని చెబుతున్నారు.