అమరావతి జనవరి 11 (way2newstv.com)
భాజపా, తెదేపాతో విడిపోయాం కాబట్టే వైకాపా బలపడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ విస్త్రత స్థాయి సమావేశంలో పవన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం సీట్లు యువతకు కేటాయిస్తామన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
రైతులకు అండగా జనసేన
అమరావతి భూముల విషయంలో తాను వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయని చెప్పారు.మూడు రాజధానుల ప్రకటన తర్వాత సీఎం విశాఖకు వెళ్తే జనం నుంచి స్పందన లేదని పవన్ ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ నిర్వహిస్తే ప్రజలు ఎలా వచ్చారో అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు వేస్తామని వెల్లడించారు. కొత్త రక్తం రాకపోతే రాజకీయాల్లో మార్పు రాదన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.