ఏడేళ్లు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏడేళ్లు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి

న్యూఢిల్లీ, జనవరి 9 (way2newstv.com)
నిర్భయ దోషులకు ఢిల్లీ పాటియాలా కోర్టు  డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా పాటియాలా కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డెత్ వారెంట్‌పై న్యాయమూర్తి నిర్ణయం వెలువడిన తర్వాత దోషుల్లో ఒకరైన ముకేశ్‌సింగ్ తల్లి.. నిర్భయ తల్లి దగ్గరకు వెళ్లి తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించమని చీర కొంగుచాచి అర్ధించింది. ‘నిన్ను వేడుకుంటున్నాను .. దయచేసి నా కొడుకు జీవితాన్ని ప్రసాదించు... వాడిని నాకు ఇవ్వండి’ అంటూ ప్రాధేయపడింది. అయితే, దీనికి నిర్భయ తల్లి స్పందిస్తూ.. బాధితురాలు నా కూతురు.. ఆమెకు జరిగిన ఘోరం నేను ఎలా మరిచిపోతాను.. ఏడేళ్లుగా నేను దీని కోసం ఎదురుచూస్తున్నాను’ అని బదులిచ్చింది.
ఏడేళ్లు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి

ఈ సన్నివేశాన్ని అలా చూస్తు ఉన్న న్యాయమూర్తి.. తర్వాత తేరుకుని విచారణ కొనసాగించారు. కోర్టులో జరిగిన సంఘటనపై ఇంటర్వ్యలో నిర్భయ తల్లి మాట్లాడుతూ.. అన్యాయమైన నా కూతురికి న్యాయం కోసం ఏడేళ్లు పాటు ఏడ్చిఏడ్చి రాయిలా మారానని నిర్భయ తల్లి వాపోయారు. అందుకే దోషి ముకేశ్‌సింగ్‌ తల్లి వచ్చి తనను క్షమాభిక్ష కోరినప్పుడు ఏమాత్రం చలనం రాలేదని ఆమె పేర్కొన్నారు.ఏడేళ్ల కిందట మా బిడ్డను కోల్పోయాం.. ఆమెను చూసినప్పుడు ఆమె నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉంది... ఆమె ఒంటిపై లెక్కలేనన్ని గాయాలున్నాయి. వాటిని కళ్లారా చూశాను. జంతువులు దాడి చేసినా అంతలా గాయాలు కావేమో.. నాటి నుంచి ఇప్పటి వరకూ నా కళ్లలో రక్తమే కన్నీటి రూపంలో బయటకు వస్తోందిది. ఏడ్చిఏడ్చి నేను బండబారిపోయాను... నా కతూరురిని ఆ స్థితిలో చూసిన దగ్గర నుంచి ప్రతి రోజూ మరణిస్తూనే ఉన్నాను.. అందుకే ఏడు సంవత్సరాల పాటు యుద్ధం చేశాను... ఈ ఉరి శిక్ష కేవలం నిర్భయ తల్లిదండ్రుల విజయం మాత్రమే కాదు.. ఇది దేశంలోని ప్రతి కుమార్తె రక్షణ, న్యాయానికి దక్కిన విజయం’ అని ఆమె ఉద్వేగానికి గురయ్యారు.వినశనానికి గురైన తల్లిదండ్రులకు కోర్టు విచారణాలు ఏళ్లుగా సాగి చాలా నిరాశకు గురిచేస్తున్నాయి. దేశంలో జరుగుతున్న ప్రతి కొత్త ఘటన తమ కుమార్తెను కోల్పోయిన బాధను బలవంతంగా అణచివేసుకునేలా చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ.. ‘తమ కుమార్తెకు జీవితంలో జరిగిన ఆ ఘటన చూసిన తర్వాత ఎవరూ మరచిపోలేరని, అందరూ ఒకేలా ఉండలేరని అన్నారు. మా మనసులో బాధ జీవితాంతం ఉంటుంది.. కానీ దోషులను ఉరితీస్తే దేశానికి బలమైన సందేశం వెళ్తుంది.. ముఖ్యమంగా నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు’ అని ఆయన ఉద్ఘాటించారు.