రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు శకునిలా అడ్డుపడుతున్నాడు

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం జనవరి 9 (way2newstv.com)
అనంతపురం అర్బన్ లోని శారదా నగరపాలక బాలికల పాఠశాలలో గురువారం  ఏర్పాటు చేసిన అమ్మఒడి కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హజరయ్యారు.  అయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇచ్చిన మాటకు కట్టుబడిగా కష్టనష్టాలను గురించి ఆలోచించక చెప్పిన హామీలను 7 నెలల్లోనే అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మాత్రమేనన్నారు. 
రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు శకునిలా అడ్డుపడుతున్నాడు

రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ ఫలాలతో అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతుంటే చంద్రబాబు ఒక శకునిలా అడ్డుపడుతున్నాడని విమర్శించారు. పేద,ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య అభ్యసించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అమ్మఒడి పథకం ధ్వారా తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15వేలును,అంతేకాకుండా హాస్టల్ లో చదువుకున్న పిల్లలకు రూ.10-20వేలు అందిస్తామన్నారు. పిల్లల్ని బడికి పంపించండి వారిని మేము చదివిస్తామంటూ భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి శంకర్ నారాయణ,కలెక్టర్ గంధం చంద్రుడు, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post