న్యూఢిల్లీ జనవరి 30 (way2newstv.com)
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ,
మహాత్ముడికి ప్రముఖులు ఘన నివాళ్లు
బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, నావీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదూరియా తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత సేవలు, ఆశయాలను దేశ ప్రజలందరూ స్మరించుకుంటున్నారు